ఇటీవల జరిగిన సైమా అవార్డు ఫంక్షన్‌లో హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విక్రమంలో సినిమాలో తాను చేసిన రోలెక్స్ పాత్ర చేయడం ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ ఏడాది వచ్చిన ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ విక్రమ్ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ మూవీ తమిళం, తెలుగులో విశేష ఆదరణ అందుకుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ అందించింది.
చదవండి: ఈ వారం థియేటర్ ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే
అయితే ఈ చిత్రంలో సూర్య రోలెక్స్ అనే మాఫీయా గ్యాంగ్ లీడర్‌గా కనిపించాడు. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఆ పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. సూర్య ఎంట్రీకి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్. విలనిజానికి కేరాఫ్‌గా అడ్రస్‌గా సూర్య ఇందులో కనిపించాడు. చివరి 5 నిముషాలో రోలెక్స్ పాత్రను పరిచం చేశాడు డైరెక్టర్. కనిపించిన 5 నిమిషాలు సూర్య తన కళ్లలో చూపించిన క్రూరత్వం, నవ్వుతూనే భయపెట్టిన ఆయన నటనకు ప్రతిఒక్కరు ఫిదా అయ్యారు. అలా విక్రమ్‌లో ప్రేక్షకులను రోలెక్స్‌గా భయపెట్టిన సూర్యకు ఈ పాత్ర చేయాలంటే మొదట భయం వేసిందట.
చదవండి: ‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సైమా అవార్డు ఫంక్షన్‌లో తెలిపాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘విక్రమ్‌లో రోలెక్స్ పాత్ర చేయాలంటే మొదట భయంగా అనిపించింది. డైరెక్టర్ లోకేశ్ కనకరాజుకు చేయనని చెబుదామని అనుకున్న. కానీ అదే సమయంలో కమల్ సార్ ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పారు. దీంతో చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఓకే చెప్పాను. అది కేవలం ఓ వ్యక్తి కోసమే. ఆయనే లోకనాయకుడు కమల్ హాసన్’ అని చెప్పుకొచ్చాడు. కాగా కమల్ హాసన్ హీరోగా నటించి ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
I did it for one man "ulaganayagan" #kamalhassan #Rolex#southfilmfare #filmfareawards2022 @ikamalhaasan @suru #bengaluru pic.twitter.com/yK07292uRm
— Civic Ranter (@deerajpnrao) October 9, 2022
Comments
Please login to add a commentAdd a comment