![Anirudh Ravichander Epic Reply To What Kamal Haasan Gift Him For Vikram Success - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/17/kamal-haasan.jpg.webp?itok=HsETeijz)
సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు లోక నాయకుడు కమల్ హాసన్. ఆయన తాజాగా నటించిన విక్రమ్ మూవీ బ్లాక్‌బ్లస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 300 కోట్లు వసూళు చేసింది. కమల్ స్వయంగా నిర్మించిన ఈ మూవీ భారీ హిట్ అందుకోవడంతో ఆయన ఫుల్ ఖుషిలో ఉన్నాడు. విక్రమ్ ఇంతపెద్ద హిట్ అయినందుకు ఇందులో భాగమైన చిత్రం యూనిట్‌కు ఖరీదైన బహుమతులు ఇచ్చిన సింగతి తెలిసిందే.
చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య
అయితే ఈ సినిమా విజయంలో పాటలు, సంగీతం కూడా ముఖ్య పాత్ర పోషించాయి. అయితే ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించిన అనిరుద్ రవిచందర్‌కు మాత్రం కమల్ ఏ గిఫ్ట్ ఇవ్వలేదట. ఈ విషయాన్ని అనిరుధ్ స్యయంగా వెల్లడించాడు. విక్రమ్ సక్సెస్ నేపథ్యంలో ఇటీవల అనిరుధ్ రవిచందర్ ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా విక్రమ్ సక్సెస్‌కి కమల్ సర్ అందరికి గిఫ్ట్స్ ఇస్తున్నారు.. మరి ఆయన నుంచి మీకు గిఫ్ట్ ఏం రాలేదా? అని అడగడంతో అనిరుధ్ ఇలా స్పందించాడు.
చదవండి: విరాటపర్వం ఎమోషనల్ లవ్ స్టోరీ
‘కమల్ హాసన్ సర్ నుంచి నాకు ఎలాంటి బహుమతి అందలేదు. అసలు ఆయనతో పని చేసే అవకాశం రావడమే నాకు పెద్ద గిఫ్ట్. ఇంకా సపరేట్‌గా ఎలాంటి గిఫ్ట్ అవసరం లేదు’ అంటూ సమాధానం ఇచ్చాడు. కాగా ఈ మూవీ దర్శకుడు లోకేశ్ కనగరాజుకు కోటీ విలువ చేసే లెక్సాస్ లగ్జరీ కారును కమల్ బహుమతిగా ఇవ్వగా.. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన 13 మందికి బైక్‌లు ఇచ్చాడు. ఇక ఇందులో కీ రోల్ పోషించిన హీరో సూర్య రూ. 60 లక్షలు విలువ చేసే రోలెక్స్ వాచ్ కానుక ఇచ్చాడు. ఇక మరో ప్రధాన పాత్రలు పోషించిన య్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌లకు కూడా ఆయన ఎలాంటి కానుకలు ఇవ్వలేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment