దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘విక్రమ్’తో వెండితెరపై సందడి చేశాడు లోకనాయకుడు కమల్ హాసన్. ‘ఖైదీ’,‘మాస్టర్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు.
జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.యాక్షన్ సీన్స్‌లో కమల్ హాసన్ చూపించిన యాటీట్యూడ్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 67 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫైట్స్ సీన్స్ చేశాడు. కమల్‌ని ఫ్యాన్స్ తెరపై ఎలా చూడాలని కోరుకున్నారో అలా చూపించాడు. అందుకే ఈ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ.45 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఒక్క తమిళనాడులో రూ.20 కోట్లు వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో రూ.4.02 కోట్లు, ఏపీ, తెలంగాణలో రూ.3.70, కేరళలో రూ.5.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.11.50 కోట్లను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ వారంతంలో ఈ చిత్రం ఈజీగా రూ.100 కోట్ల క్లబ్ చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచానా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment