కమలహాసన్‌ 233వ చిత్రం టైటిల్‌ అదేనా? | Interesting Title For Kamal Haasan 233rd Film | Sakshi
Sakshi News home page

కమలహాసన్‌ 233వ చిత్రం టైటిల్‌ అదేనా?

Published Wed, Oct 18 2023 7:30 AM | Last Updated on Wed, Oct 18 2023 9:24 AM

Interesting Title For Kamal Haasan 233 Film - Sakshi

తమిళసినిమా: విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ నటించిన తన 233వ చిత్రాలు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. విక్రమ్‌ అంటే సంచలన విజయం సాధించిన చిత్రం తర్వాత ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత కమలహాసన్‌ చాలా బిజీగా మారిపోయారు. వరుసగా చిత్రాలు కమిట్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన శంకర్‌ నటిస్తున్న ఇండియన్‌ – 2 చిత్రాన్ని పూర్తి చేసి తెలుగులో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న కల్కి చిత్రంలో నటిస్తున్నారు.

ఇందులో ఈయన చాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో బిగ్‌బాస్‌ రియాల్టీ షో సీజన్‌ 7 కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఆయన తన 233, 234 చిత్రాలకు కమిట్‌ అయ్యారు. కమలహాసన్‌ నటించిన 233వ చిత్రానికి హెచ్‌ .వినోద్‌  దర్శకత్వం వహిస్తున్నారు. 234 చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించరున్నారు.

కాగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో నటించే చిత్రానికి కమలహాసన్‌ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. కాగా ఈ చిత్ర టైటిల్‌ గురించే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన మర్మయోగి చిత్ర టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టాలని దర్శకుడు హెచ్‌.వినోద్‌ భావిస్తున్నట్లు సమాచారం.

కమలహాసన్‌ 2002లోనే మర్మయోగి పేరుతో ప్రతిష్టాత్మక కథా చిత్రాన్ని ప్రారంభించి కొంత భాగాన్ని చిత్రీకరించారు కూడా. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం పూర్తి కాలేదు. అదే టైటిల్‌ హెచ్‌ వినోద్‌ తాజాగా కమలహాసన్‌ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రానికి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి కమలహాసన్‌ అంగీకరిస్తారా..? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement