karma yogi
-
కమలహాసన్ 233వ చిత్రం టైటిల్ అదేనా?
తమిళసినిమా: విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన తన 233వ చిత్రాలు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. విక్రమ్ అంటే సంచలన విజయం సాధించిన చిత్రం తర్వాత ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత కమలహాసన్ చాలా బిజీగా మారిపోయారు. వరుసగా చిత్రాలు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన శంకర్ నటిస్తున్న ఇండియన్ – 2 చిత్రాన్ని పూర్తి చేసి తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న కల్కి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈయన చాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో బిగ్బాస్ రియాల్టీ షో సీజన్ 7 కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఆయన తన 233, 234 చిత్రాలకు కమిట్ అయ్యారు. కమలహాసన్ నటించిన 233వ చిత్రానికి హెచ్ .వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. 234 చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించరున్నారు. కాగా హెచ్.వినోద్ దర్శకత్వంలో నటించే చిత్రానికి కమలహాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. కాగా ఈ చిత్ర టైటిల్ గురించే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మర్మయోగి చిత్ర టైటిల్ను ఈ చిత్రానికి పెట్టాలని దర్శకుడు హెచ్.వినోద్ భావిస్తున్నట్లు సమాచారం. కమలహాసన్ 2002లోనే మర్మయోగి పేరుతో ప్రతిష్టాత్మక కథా చిత్రాన్ని ప్రారంభించి కొంత భాగాన్ని చిత్రీకరించారు కూడా. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం పూర్తి కాలేదు. అదే టైటిల్ హెచ్ వినోద్ తాజాగా కమలహాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రానికి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి కమలహాసన్ అంగీకరిస్తారా..? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
‘మిషన్ కర్మయోగి’కి కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులను మరింత సమర్థ్ధవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ‘మిషన్ కర్మయోగి’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేబినెట్ ఈ ‘మిషన్ కర్మయోగి లేదా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్(ఎన్పీసీఎస్సీబీ)’కార్యక్రమానికి పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, సానుకూల దృక్పథం కలిగినవారుగా, వృత్తి నిపుణులుగా, సాంకేతికంగా మరింత మెరుగైన వారిగా మార్చే అతిపెద్ద పాలనా సంస్కరణగా ‘మిషన్ కర్మయోగి’ని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. సరైన దృక్పథం, లోతైన జ్ఞానం, ఆధునిక నైపుణ్యాలు కలగలసిన, భారతదేశ భవిష్యత్ అవసరాలను తీర్చగల సమర్థ్ధులైన ఉద్యోగులుగా వారిని సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ‘మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఇది అతిపెద్ద ప్రభుత్వ కార్యక్రమం’అని కేబినెట్ భేటీ అనంతరం సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని దేశసేవకు ఉపయోగపడే అసలైన కర్మయోగిగా మార్చేలా ఈ కార్యక్రమం ఉంటుందని సిబ్బంది శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ‘2020 నుంచి 2025 వరకు దశలవారీగా రూ. 510.86 కోట్ల వ్యయంతో సుమారు 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, పథకానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలో కొందరు ఎంపిక చేసిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రఖ్యాత హెచ్ఆర్ నిపుణులు సభ్యులుగా ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేస్తారు. భవిష్యత్ భారత అవసరాలను తీర్చగల సమర్ధులైన ఉద్యోగులను రూపొందించడం మిషన్ కర్మయోగి లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జమ్మూ, కశ్మీర్లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇంగ్లీష్, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ‘జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్–2020’ని రానున్న సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెడ్తామని జావదేకర్ వెల్లడించారు. -
మోడీ కర్మయోగి, వికాస పురుషుడు: వివేక్ ఒబెరాయ్
ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీకి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మద్దతు తెలిపారు. మోడీని కర్మయోగి, వికాస్ పురుష్ అని వివేక్ కితాబిచ్చారు. దేశానికి మోడీ సేవలు ఎంతో అవసరమని వివేక్ తెలిపారు. గుజరాత్ లో అభివృద్ది చూపిన నేత అని బాలీవుడ్ నటుడు ప్రశంసలతో ముంచెత్తారు. గుజరాత్ లో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించారన్నారు. మోడీ తక్కువ మాట్లాడుతారని.. ఎక్కువ పనిచేస్తారని ఆయన అన్నారు. బాలీవుడ్ లో ప్రతి ఒక్కరు మోడీకి ఓటు వేయాలని వ్యక్తిగతం అభ్యర్థిస్తున్నానని వివేక్ తెలిపారు. రాజకీయాలను, సిద్దాంతాలన్నింటిని పక్కన పెట్టి హిందు, ముస్లీం, దళితులు ఓటు వేయాలన్నారు. ముంబైలో ఏప్రిల్ 24 తేదిన ఎన్నికల జరుగనున్నాయి.