కమల్‌హాసన్ హీరోగా తన 233వ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వంలో చేస్తున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తన రాజమ్మ ఫిలిం ఇంటర్‌నేషనల్ పతాకంపై కమలహాసన్ నిర్మించడానికి సన్నాహాలు చేశారు. హెచ్. వినోద్ కథను కూడా సిద్ధం చేశారు. ఇది వ్యవసాయం నేపథ్యంలో సాగే చక్కని సందేశాత్మక కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది.
ఈ చిత్ర కథపై కమలహాసన్ హెచ్ వినోద్ చాలాకాలం పని చేశారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరిగినట్లు సమాచారం. దీని తరువాత కమలహాసన్ తన 234వ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా హెచ్. వినోద్ దర్శకత్వంలో కమల్ నటించే చిత్రం విషయంలో ఏం జరిగిందో తెలియదు గానీ, ప్రస్తుతం కమల్‌హాసన్ మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు.
దీంతో ఈయన వినోద్ దర్శకత్వంలో నటించే చిత్రం డ్రాప్ అయిందనే ప్రచారం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై కమల్‌హాసన్‌గానీ దర్శకుడు వినోద్ గానీ స్పందించలేదు. కాగా వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్నట్లు చిత్రం తాజా సమాచారం. దీంతో వినోద్ ప్రస్తుతం నటుడు యోగిబాబు, ధనుష్‌తో చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఖాకీ, తెగింపు, వలిమై చిత్రాలతో హెచ్ వినోద్‌కు మంచి గుర్తింపు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment