తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా ఖరారైపోయింది. పలు సినిమాలు తీసిన దర్శకుడు హెచ్.వినోద్‌కి ఈ మూవీ తీసే అవకాశం దక్కింది. రాక్ స్టార్ అనిరుధ్ సంగీత దర్శకుడు. కన్నడలో బోలెడన్ని మూవీస్ తీసిన కేవీఎన్ ప్రొడక్షన్స్.. దీన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుంది. వచ్చే ఏడాది అక్టోబరులో రిలీజ్ ఉంటుందని ప్రకటించారు.
(ఇదీ చదవండి: చావు బతుకుల్లో ఉన్న వీరాభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్)
ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ వచ్చిన విజయ్.. తన చివరి చిత్రాన్ని మాత్రం పూర్తిగా తన రాజకీయ జీవితానికి పనికొచ్చేలా తీయబోతున్నాడు. అధికారికంగా ప్రకటించిన పోస్టర్ బట్టి చూస్తే.. అగ్నితో వెలుగుతున్న కాగడ పట్టుకుని ఓ చేయి, పైన 'ద టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ' అనే వాక్యం కనిపించింది.
2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 2025 అక్టోబరులో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. అంటే విజయ్ పొలిటికల్ కెరీర్‌కి ఈ సినిమా ఎంతో కొంత ఉపయోగపడటం గ్యారంటీ. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఏంటనేది తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు!
(ఇదీ చదవండి: హీరో రజనీకాంత్ షూటింగ్ లో అగ్ని ప్రమాదం)
We are beyond proud & excited to announce that our first Tamil film is #Thalapathy69, directed by the visionary #HVinoth, with music by the sensational Rockstar @anirudhofficial 🔥
Super happy to collaborate with the one and only #Thalapathy @actorvijay ♥️
The torch bearer of… pic.twitter.com/Q2lEq7Lhfa— KVN Productions (@KvnProductions) September 14, 2024
Comments
Please login to add a commentAdd a comment