చావు బతుకుల్లో ఉన్న వీరాభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్ | Ntr Video Call To His Fan Who Diagnosed With Cancer | Sakshi
Sakshi News home page

NTR Fan: నీకేం కాదు.. అభిమాని చివరి కోరిక తీర్చిన తారక్

Published Sat, Sep 14 2024 5:28 PM | Last Updated on Sat, Sep 14 2024 5:58 PM

Ntr Video Call To His Fan Who Diagnosed With Cancer

ఎన్టీఆర్ 'దేవర' సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కౌశిక్ (19) అనే కుర్రాడితో ఎన్టీఆర్ ఇప్పుడు వీడియో కాల్ మాట్లాడటం వైరల్ అయిపోతోంది. చనిపోయేలోపు 'దేవర' సినిమా చూడాలనుకుంటున్నానని ఈ కుర్రాడు చెప్పడం, అది కాస్త తారక్ వరకు చేరుకోవడంతో ఇప్పుడు ఇలా వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్‪‌కి చెందిన కౌశిక్ (19) ప్రస్తుతం బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చనిపోయేలోపు 'దేవర' చూడాలనుకుంటున్నానని, అప్పటివరకు తనని బతికించాలని డాక్టర్లని వేడుకున్నాడు. ఈ విషయం కొన్నిరోజుల క్రితం వార్తల్లో వచ్చింది. కౌశిక్ తల్లిదండ్రులు కూడా తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రస్తుత పరిస్థితి గురించి వివరించారు.

(ఇదీ చదవండి: 'కూలీ' షూటింగ్.. హీరో రజినీకాంత్ కి తప్పిన అగ్ని ప్రమాదం)

చిన్నప్పటినుంచి ఎన్టీఆర్‌ అంటే కౌశిక్‌కు చాలా ఇష్టం, నా కొడుకు బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నాడు. అయినా సరే 'దేవర' చూడాలనుకుంటున్నాడు. సెప్టెంబర్‌ 27 వరకు తనని బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. దేవర చూడడమే కౌశిక్‌ ఆఖరి కోరిక’ అని కుర్రాడి తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయింది. 

అయితే కౌశిక్ ఆరోగ్య పరిస్థితి, 'దేవర' చూడాలనుకోవడం తదితర విషయాలు ఎన్టీఆర్ వరకు వెళ్లగా.. స్వయంగా ఆయనే వీడియో కాల్ చేసి, తన వీరాభిమానితో మాట్లాడాడు. 'నవ్వుతుంటే బాగున్నావ్' అని ఎన్టీఆర్ అనడంతో.. మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదని సదరు అభిమాని ఎమోషనల్ అయ్యాడు. భలేవాడివి, నేను మాట్లడకపోతే ఎలా అని ఎన్టీఆర్ అన్నాడు. నువ్వు క్యాన్సర్ దాటి రావాలి, 'దేవర' సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరారు. ఈ మూవీ అవన్నీ పక్కనబెడితే ముందు నీ ఆరోగ్యం బాగుండాలని తారక్ అన్నాడు. ఒక్కసారైనా కలవాలని ఉందని అభిమాని కోరగా.. కచ్చితంగా కలుస్తానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్ మేఘా ఆకాశ్.. మెహందీ ఫొటోలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement