పునీత్ రాజ్‌కుమార్
కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్‌కుమార్ స్టార్ హీరో. ఇప్పుడు తుళూ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే యాక్టర్‌గా కాదు సింగర్‌గా మాత్రమే. సింగర్‌గా తన గొంతును ‘ఉమ్లీ’ (దోమ) అనే తుళూ సినిమాలో వినిపించనున్నారు. తుళూ ఇండస్ట్రీలో రూపొందిన ఫస్ట్ గ్రాఫిక్స్ ప్రధాన చిత్రం ‘ఉమ్లీ’ కావడం విశేషం. ఈ సినిమాలో వచ్చే మాస్ సాంగ్‌నే పునీత్ రాజ్‌కుమార్ పాడారట.
ఈ సాంగ్ గురించి ఉమ్లీ దర్శకుడు రంజిత్ సువర్ణ మాట్లాడుతూ – ‘‘ఈ సాంగ్ పాడమని పునీత్ సార్‌ని అప్రోచ్ అయ్యాం. ట్యూన్ నచ్చడంతో ఆయన పాడటానికి ఒప్పుకున్నారు. నాలుగు నెలలపాటు ఈ పాటను ప్రాక్టీస్ చేశారు. తుళూ పదాల ఉచ్చారణలో తప్పులు దొర్లకుండా ఉండాలని సీరియస్‌గా సాధన చేశారు. పాట చాలా అద్భుతంగా వచ్చింది’’ అని పేర్కొన్నారు. అన్నట్లు.. కన్నడంలో కూడా పునీత్ పలు పాటలు పాడారు.
Comments
Please login to add a commentAdd a comment