పునీత్ రాజ్‌కుమార్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా | Puneet Rajkumar's big-budget film | Sakshi
Sakshi News home page

పునీత్ రాజ్‌కుమార్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా

Published Fri, Nov 8 2013 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM

పునీత్ రాజ్‌కుమార్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా

పునీత్ రాజ్‌కుమార్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా

పునీత్ రాజ్‌కుమార్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా
పునీత్‌తో చేయడం సంతోషంగా ఉంది:  పరాన్జీ

 
బెంగళూరు, న్యూస్‌లైన్: రాయలసీమ ఫ్యాక్షన్ దృశ్యాలను తెలుగు సినీ అభిమానులకు కళ్లకు కట్టినట్లు చూపించిన  దర్శకుడు జయంత్ సి. పరాన్జీ కన్నడ సినీ రంగంలో అడుగు పెట్టారు. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌తో ఆయన ‘నిన్నిందలే’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. గురువారం ఆయన మల్లేశ్వరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికాలోని న్యూయార్క్ నేపథ్యంలో సినిమా ఉంటుందని అన్నారు. మొత్తం సినిమా షూటింగ్ అక్కడే జరిగిందని అన్నారు.

ఐదు శాతం మాత్రం బెంగళూరులో చిత్రీకరిచారని చెప్పారు. అమెరికాలో స్థిరపడిన కన్నడ కుటుంబాలు, కొత్తగా అక్కడికి వెళ్లిన కన్నడ కుటుంబాల మధ్య జరిగే కథ అన్నారు. అక్కడి పరిస్థితులు నేటి యువత, పెద్దల మనస్థత్వాల నేపథ్యంలో సినిమా ఉంటుందని అన్నారు. ఈ సినిమా తప్పకుండ అన్ని వర్గాల వారిని  ఆకట్టుకుంటుందని అన్నారు. మొదట రణబీర్ కపూర్ లేదా షాహిద్ కపూర్‌తో హిందీలో ఈ సినిమా చెయ్యాలని బావించానని, అనుకోకుండ పునీత్ రాజ్‌కుమార్‌కు కథ చెప్పడంతో ఒకే సిట్టింగ్‌లో ఓకే చేసి డేట్స్ ఇచ్చారని అన్నారు.

తాను బెంగళూరులో పుట్టి ఇక్కడే హైస్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేశానని గుర్తు చేసుకున్నారు. చిన్నపట్టి నుంచి డాక్టర్ రాజ్‌కుమార్ సినిమాలు చూసేవాడని, కన్నడలో మొదటి సినిమా అదే కుటుంబంలోని పునిత్‌రాజ్‌కుమార్‌తో చెయ్యడం ఆనందంగా ఉందని అన్నారు. పునీత్ , ఎరికా ఫెర్నాండెజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నట్లు చెప్పారు. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు ఈ సినిమాలో న టిస్తున్నట్లు చెప్పారు. ఆయనను స్క్రీన్ మీద చూడాల్సిందేనని జయంత్ సీ. పరాన్జీ వివరించారు. తరువాత సినిమా సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఉంటుందని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement