కన్నడంలో పునీత్‌కి జోడీగా... | Anjali To Romance Puneet Rajkumar In Ranavikrama | Sakshi
Sakshi News home page

కన్నడంలో పునీత్‌కి జోడీగా...

Published Tue, May 6 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

కన్నడంలో పునీత్‌కి జోడీగా...

కన్నడంలో పునీత్‌కి జోడీగా...

కన్నడ టాప్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సరసన నటించే అవకాశం అంజలికి దక్కింది. పవన్ వడయార్ దర్శకత్వంలో పునీత్ ‘రాణా విక్రమ’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తొలుత ఇందులో నాయికగా తమన్నాని అనుకున్నారు. తర్వాత శ్రుతిహాసన్ కోసం ప్రయత్నించారు. ఫైనల్‌గా ఈ అవకాశం అంజలిని వరించింది. అంజలి ఆచూకి అంత సులువుగా దొరక్క దర్శకుడు చాలా కష్టపడ్డారట. చివరకు ఓ మిత్రుడు ద్వారా అంజలిని కాంటాక్ట్ చేశారు. అంజలికి ఇది రెండో కన్నడ సినిమా. 2008లో ‘హోంగానసు’ అనే సినిమాలో నటించారామె. జూన్ నెలలో అంజలి     ఈ సినిమా షూటింగ్‌లోకి ఎంటరవుతారు. ప్రస్తుతం అంజలి తెలుగులో ‘గీతాంజలి’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement