![Man Assassinated His Brother Over Family Rivalries Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/28/Crime_0126.jpg.webp?itok=RUGv5u3n)
సాక్షి,పరిగి(వికారాబాద్): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన అన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మయ్య(38) అదే గ్రామానికి చెందిన తన చెల్లెలు భర్త వెంకటయ్యతో మంగళవారం రాత్రి గొడవపడ్డాడు. ఈక్రమంలో లక్ష్మయ్య తన బావ వెంకటయ్య తలపగులగొట్టాడు.
ఈ విషయం తెలుసుకున్న వెంకటయ్య కుమారుడు నవీన్ లక్ష్మయ్యపై దాడి చేశాడు. బుధవారం ఉదయం లక్ష్మయ్య తమ్ముడు అనంతయ్య.. బావ తలపగులగొడుతావా..? అంటూ ఆగ్రహంతో లక్ష్మయ్యపై రాళ్లు, కర్రలతో దాడి చేశాడు. ఈ ఘటనలో లక్ష్మయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఇంట్లోకి వెళ్లి పడుకున్న లక్ష్మయ్య దెబ్బలకు తాళలేక మృతి చెందాడు. మధ్యాహ్నం అయినా ఆయన ఇంట్లోంచి రాకపోవడంతో గమనించిన చుట్టుపక్కల వారు లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. లక్ష్మయ్యపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతయ్య పరారీలో ఉన్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. లక్ష్మయ్య ఆయన భార్య గతంలోనే విడిపోయింది. ఆయనకు 7 సంవత్సరాల కూతురు ఉంది. తండ్రి మృతి చెందడంతో చిన్నారి అనాథగా మారింది.
చదవండి: ‘అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే..
Comments
Please login to add a commentAdd a comment