పిల్లలతో ఈశ్వరమ్మ, కోటేశ్వరరావు(ఫైల్) మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ గోవిందరావు, ఎస్‌ఐ గణేష్
ఆనందపురం(భీమిలి): కలకాలం తోడు ఉండాల్సిన భర్త అనుమానం పెంచుకున్నాడు. దీనికి అతని కుటుంబ సభ్యులు కూడా వంత పాడడంతో కాలయముడుగా మారా డు. విచక్షణా జ్ఞానం కోల్పోయి కట్టుకున్న భార్యనే ఇంట్లోనే గొంతు నులిమి నిర్ధాక్షిణ్యంగా కడతేర్చాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని గిడిజాల పంచాయతీ వేమగొట్టిపాలెంలో ఆది వారం రాత్రి జరగగా.. సోమవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. వేమగొట్టిపాలేనికి చెందిన ముది లి పెంటమ్మ, యర్రయ్య దంపతులకు కోటేశ్వరరావు, రమణ, సత్యారావు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దవాడైన కోటేశ్వరరావు లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు.
ఈయనకు 13 ఏళ్ల కిందట మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన ఈశ్వరమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ఇదిలా ఉండగా మొదటి నుంచి భార్య ఈశ్వరమ్మ ప్రవర్తనపై కోటేశ్వరరావుకు అనుమా నం. దీంతో ఆమెను నిత్యం వేధించడంతో గొడవలు జరిగేవి. కోటేశ్వరరావును మందలించాల్సిన అతని తల్లిదండ్రులు వంత పాడారు. ఎప్పటిౖMðనా ‘నిన్ను హతమార్చుతానంటూ’భార్యను హెచ్చరించే వాడని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కోటేశ్వరరావు ఇంట్లో పెద్దగా కేకలు వినిపించడంతో చుట్టు పక్కల వారు పరుగున వెళ్లి చూడగా.. ఈశ్వరమ్మ(30) విగతజీవిగా పడి ఉంది. కోటేశ్వరరావుతో పాటు ఈయన తల్లిదండ్రులు పెంటమ్మ, యర్రయ్యలు కనిపించకుండా పోవడంతో స్థానికలు పోలీసులకు సమాచారం అందించారు.
గొంతు నులిమి చంపేశారు?
మృతురాలు ఈశ్వరమ్మ తలపై స్వల్ప గాయాలు ఉండి రక్తం స్రావమైంది. గొంతు నులిమి చంపేసినట్టు మెడపై ఆనవాళ్లుతో పాటు, గోళ్లు రక్కులు ఉన్నాయి. ఒంటిపై ఆభరణాలు కింద పడి ఉండడంతో పెనుగులాట జరిగి నట్టు తెలుస్తోంది. ఏ ఆయుధం లేకుండా ఒక వ్యక్తి హతమార్చలేడని.. కోటేశ్వరరావుకు కుటుంబ సభ్యులు కూడా సహకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సంఘటన స్థలంలో పూర్తి స్థాయి విచారణ జరిపారు.
అందరూ ఉండి అనాథలైన పిల్లలు
కోటేశ్వరరావు, ఈశ్వరమ్మలకు మహేష్(12), రాజేష్(10) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేష్ గిడిజాల హైస్కూల్‌లో 7వ తరగతి, రాజేష్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు. చిన్న వయస్సులోనే వారు తల్లిని పోగొట్టుకోవడంతో అందరూ ఉండి అనాథులుగా మిగి లారు. సంఘటన విషయమై పోలీసులు, గ్రామస్తులు హడావుడి చేయడంతో వారు బిత్తర చూపులు చూడడంతో పలువురు హృదయాలను కలచి వేసింది. ఈశ్వరమ్మ తల్లి బంగారమ్మ, సోదరుడు అప్పలరాజులు సంఘటన స్థలం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు.
పోలీసు ఉన్నతాధికారుల విచారణ
సంఘటన విషయం తెలుసుకున్న ఏసీపీ నాగేశ్వరరావు, డీసీసీ ఫకీరప్ప, స్థానిక సీఐ ఆర్.గోవిందరావులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. కూŠల్స్ టీంను కూడా రప్పించారు. భార్యాభర్తలు కుటుంబ సభ్యులు మధ్య జరిగిన వివాదాల గురించి స్థానికులను విచారించారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం హత్యగానే నిర్ధారించారు. ఆ మేరకు మృతురాలు సోదరుడైన అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటేశ్వరరావుతో పాటు పెంటమ్మ, యర్రయ్యలపై కేసు నమోదు చేశారు. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మొదట భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్పష్టమైన నివేదిక కోసం కేజీహెచ్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment