
పొన్నూరు: భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదం తల్లీ పిల్లల ఆత్మహత్యా యత్నానికి దారితీసింది. ఈ ఘటనలో ఆరేళ్ల కుమార్తె మృతిచెందగా మరో కుమార్తె, తల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చల తాడిపర్రు గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ సుభానికి ఎనిమిదేళ్ల క్రితం యడ్లపాడుకు చెందిన మౌలాబీతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పర్వీన్‌కు ఏడేళ్లు కాగా, చిన్న కుమార్తె హాసియాకు ఆరేళ్లు. భార్యాభర్తల మధ్య శనివారం ఉదయం ఘర్షణ జరిగింది. అనంతరం మౌలాబీ తన ఇద్దరు కుమార్తెలపై పెట్రోలు పోసి నిప్పంటించి ఆ తర్వాత తనూ అంటించుకుంది.
మంటలు తట్టుకోలేక చిన్నారులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అనంతరం వారిని గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. చికిత్స పొందుతూ రెండో కుమార్తె హాసియా మృతి చెందింది. మరో కుమార్తె పర్వీన్ కోలుకుంటుండగా, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్టు సుభానీ తరచూ అనుమానించే వాడని, ఈ కారణంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని బాపట్ల డీఎస్పీ డి.గంగాధరం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment