కుటుంబ తగాదాలతో ఆత్మహత్య
Published Sat, Dec 24 2016 10:44 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
అన్నవరం :
అన్నవరం దేవస్థానం కేశ ఖండనశాలలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణుడు పెండ్యాల అప్పారావు(33) శనివారం పంపా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి భార్య, పాప, బాబు ఉన్నారు. కుటుంబ తగాదాలే ఆత్మహత్యకు కారణమని తమ ప్రాథమిక విచారణలో తేలిందని అన్నవరం ఎస్‌ఐ కె.పార్థసారథి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అప్పారావు మద్యానికి బానిస కావడం, ఇతర కుటుంబ కారణాలతో అతడి భార్య రెండు వారాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంటికి రావాల్సిందిగా రెండు రోజుల క్రితం అప్పారావు వెళ్లి, తన భార్యను కోరగా ఆమె తిరస్కరించింది. ఈ క్రమంలో అప్పారావు శుక్రవారం సాయంత్రం అన్నవరం రైల్వేస్టేçÙ¯ŒS సమీపంలో రైల్వేట్రాక్‌పై రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. దీనిని గమనించిన రైతులు అతడిని అడ్డుకుని, అప్పారావు తండ్రి పెండ్యాల చక్రరావుకు అప్పగించారు. కుటుంబ తగాదాలు పరిష్కరించుకుందామని, ఆత్మహత్య వంటి ప్రయత్నాలు చేయవద్దని తన కుమారుడికి చక్రరావు నచ్చజెప్పాడు. కాగా శనివారం ఉదయం దేవస్థానంలోని కేశఖండన శాలకు అప్పారావు విధులకు హాజరయ్యాడు. కొండమీద నుంచి కిందకు వచ్చి, మధ్యాహ్నం 12 గంటల సమయంలో పంపా బ్యారేజీ గేట్ల వద్ద నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంఘటన స్థలానికి కొద్దిదూరంలో అతడి మృతదేహం తేలింది. మృతదేహాన్ని అప్పారావు కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించారు. తండ్రి చక్రరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement