
కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం : క్షణికావేశం ఇద్దరి ప్రాణాల మీదకి తెచ్చింది. భర్తపై కోపంతో మూడు నెలల చిన్నారి గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడలో చోటుచేసుకుంది. వివరాలు.... మండలంలోని గాండ్లగూడ తండాకు చెందిన మాలావతి ప్రియాంక, చిట్టిబాబులకు ఏడాదిన్నర కిందట వివాహమైంది. వీరికి మూడు నెలల బాబు ఉన్నాడు.
అయితే మూడు రోజుల నుంచి భార్యభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి. గురువారం ఉదయం చిట్టిబాబు ఓ వివాహానికి వెళ్లగా ప్రియాంక తన కొడుకు గొంతు కోసి తాను కూడా గొంతు కోసుకుంది. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న తల్లి, కొడుకును స్థానికులు అశ్వారావు పేట ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.