భార్యపై దాడికి దిగి.. చివరికి తానే! | husband died in dramatic situation | Sakshi
Sakshi News home page

భార్యపై దాడికి దిగి.. చివరికి తానే!

Published Sat, Sep 9 2017 5:09 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

husband died in dramatic situation

సాక్షి, వరంగల్ రూరల్ : భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం చివరకు భర్త ప్రాణాలు తీసింది. చేతిలో ఉన్న అద్దంతో భార్యపై దాడి చేయడానికి యత్నించిన భర్త.. ప్రమాదవశాత్తూ అదే అద్దం బారిన పడి మృతిచెందాడు. ఈ విషాదం వరంగల్ రూరల్ జిల్లాలోని పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన జంగాల యాకన్న(45) శుక్రవారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు.

ఈ క్రమంలో ఇంట్లో ఉన్న అద్దం ముక్కతో ఆమెపై దాడి చేయడానికి యత్నించాడు. ప్రమాదవశాత్తు ఆ అద్దం యాకన్న చేతికి గుచ్చుకోవడంతో పెద్ద గాయం అయి భారీగా రక్తస్రావం జరిగింది. దీంతో అతన్ని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే భారీగా రక్తస్రావం జరగడంతో యాకన్న మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ విషాదంపై గ్రామస్తులు విదస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement