కుటుంబకలహాలతో ఒక మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలు: కుటుంబకలహాలతో ఒక మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురువారం సాయంత్రం కర్నూలు జిల్లా గోస్పాడు మండలం రామవరం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన నీతమ్మ(30) కుటుంబంలో గత కొంతకాలంగా కుటుంబకలహాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలోనే నిత్యం గొడవలతో విసుగు చెందిన నీతమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నీతమ్మ భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.