కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆసిఫాబాద్ (ఆదిలాబాద్ జిల్లా): కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం సోనాపూర్ గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కద్రుం కుందు(58) బుధవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విషయంపై కుటుంబసభ్యులను, స్థానికులను ప్రశ్నించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.