కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. నర్సింలుకు గత ఏడాది డిసెంబర్‌లో మూగ యువతితో వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెందిన నర్సింహులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.