గీతకార్మికుని ఆత్మహత్య
Published Wed, Jul 20 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో గీతకార్మికుని ఆత్మహత్య ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. చేతికందిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు, ఆరునెలల కిందట వివాహామైన భార్య రోదనలు మిన్నంటాయి.« ఎల్లారెడ్డిపేటకు చెందిన నాగుల విజయ–పర్శరాములు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఏడాదిక్రితం పెద్ద కొడుకు శ్రీకాంత్ కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం రెండో కొడుకు శ్రీనివాస్ కూడా ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరునెలల క్రితమే గంభీరావుపేటకు చెందిన లతతో శ్రీనివాస్‌కు వివాహం జరిగింది. గీతకార్మికునిగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. తల్లి విజయ, భార్య లతను ఉదయం వ్యవసాయ పనులకోసం గ్రామశివారులో వాహనంపై దించి వచ్చిన శ్రీనివాస్ సాయంత్రం వరకూ శవంగా మారడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా తాను అప్పుల పాలయ్యానని, తన చావుకు ఎవ్వరూ కారణం కాదనీ, తల్లిదండ్రులతో పాటు భార్యకు అన్యాయం చేసి వెళ్తున్నానని లేఖలో పేర్కొన్నాడు. మృతుని తండ్రి పర్శరాములు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.
Advertisement
Advertisement