కుటుంబ సమస్యలతో ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్గొండ జిల్లా సమీపంలోని చర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
చండూరు : కుటుంబ సమస్యలతో ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్గొండ జిల్లా సమీపంలోని చర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చర్లపల్లి గ్రామానికి చెందిన సులోచన(35) చండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్న ఆమె ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉన్నారు.
ఉదయం 10 గంటల ప్రాంతంలో తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఆమె సాయంత్రం వరకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి చూసేసరికి.. ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా మృతురాలికి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.