కుటుంబకలహాలతో తల్లి, ఇద్దరు కూతుళ్లు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
చింతకానీ(ఖమ్మం జిల్లా): కుటుంబకలహాలతో తల్లి, ఇద్దరు కూతుళ్లు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకానీ మండలం పందెపళ్లి రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. మండలంలోని గాంధీనగర్‌కు చెందిన షేక్ హర్మానా(25)కు జాస్మీ(5), సుహానీ(3) అనే ఇద్దరు కూమార్తెలున్నారు.
కుటుంబకలహాలతో విసిగిపోయిన హర్మానా తన ఇద్దరు కుమార్తెలతో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.