కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని ఫలక్‌నమా పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
హైదరాబాద్: కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని ఫలక్‌నమా పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. బస్తీకి చెందిన జబీన్‌బేగం(40) వైద్య సహయకురాలి(నర్స్)గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాగా.. మంగళవారం ఆమె పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కచ్ఛితమైన కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.