అన్న తిట్టాడని.. చెల్లెలు ఆత్మహత్య
Published Fri, Feb 10 2017 11:40 AM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
మంగళగిరి: కుటుంబ కలహాల నేపథ్యంలో అన్న తిట్టాడని.. ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరులో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన జాతి సమాధానం(21) అనే యువతి కుటుంబంలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి అన్నయ్య తిట్టడంతో మనస్తాపానికి గురై కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement