భూపాలపల్లి (వరంగల్ జిల్లా) : రెండు కుటుంబాల మధ్య ఉన్న తగాదాలు ఒక మహిళ ప్రాణాలు తీశాయి. ఈ సంఘటన ఆదివారం వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... ఆజంనగర్ గ్రామానికి చెందిన గాదం గౌరయ్య, సమ్మక్క(45) భార్యాభర్తలు. కాగా సమ్మక్క కుటుంబానికి, ఆమె మరిది గాదం సతీష్ కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన గొడవ కారణంగా మరిది సతీష్.. సమ్మక్కపై దాడి చేసి ఆమెను హతమార్చాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సమ్మక్క భర్త 20 ఏళ్ల క్రితమే చనిపోయారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లి చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.