
సాక్షి, కాకినాడ: తుని మండలం ఎర్రకోనేరు వద్ద దారుణం జరిగింది. ఓ మహిళా చిరు వ్యాపారిని నగదు కావాలంటూ బెదిరించి.. కత్తులతో దాడి చేశారు ఇద్దరు దుండగులు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే కన్నుమూసింది.
తొలుత.. ఆ దారి వెంట వెళ్తున్న ఓ ఆటోను ఆపి డ్రైవర్‌ను కత్తితో దాడి చేశారు ఇద్దరు దుండగులు. దాడి అనంతరం అతని ఆటో తీసుకుని పరారయ్యారు. ఈ క్రమంలో.. కొద్ది దూరంలో చిన్న కొట్టు నడిపించుకుంటున్న మహిళను గమనించారు. ఆమె దగ్గరకు వెళ్లి కత్తి చూపించి నగదు కావాలంటూ బెదిరించారు. ఆమె భయంతో కేకలు వేయగా.. కత్తితో దాడి చేసి పరారయ్యారు.
గాయపడిన మహిళను స్థానికులు తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మృతి చెందింది. గాయపడిన ఆటో డ్రైవర్‌ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. క్లూస్ టీం ఘటనా స్థలి నుంచి వివరాలు సేకరించింది. మృతి చెందిన మహిళ పేరు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: దిశ పోలీసుల ఎంట్రీతో నర్సింగ్ విద్యార్థినులు సేఫ్
Comments
Please login to add a commentAdd a comment