తన భార్యను తిరిగి ఇంటికి తీసుకురావాలని పోలీస్‌స్టేషన్ గడప తొక్కిన యువకుడు స్టేషన్లోనే గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
మహబూబ్‌నగర్ : తన భార్యను తిరిగి ఇంటికి తీసుకురావాలని పోలీస్‌స్టేషన్ గడప తొక్కిన యువకుడు స్టేషన్లోనే గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి పోలీస్‌స్టేషన్లో గురువారం చోటుచేసుకుంది. బిజినేపల్లికి చెందిన నిజాం(36) అనే వ్యక్తి వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
తాగుడుకు బానిసైన నిజాం తరచూ భార్యను కొడుతూ ఉండేవాడు. దీంతో విసుగు చెందిన అతని భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి సైకోలా ప్రవర్తిస్తూ పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. తాజాగా గురువారం తన భార్యను ఇంటికి తీసుకురావాలని పోలీసులను ప్రాధేయపడ్డాడు. ఈ క్రమంలో పోలీసులు అతనికి సర్దిచెప్పి తమ పనిలో నిమగ్నమై ఉండగా బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వెంటనే గమనించిన పోలీసులు అతన్ని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.