
సాక్షి, కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్–కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌ల మధ్య గల క్రాస్‌లైన్‌లో ట్రైయిన్ వాషింగ్ సైడ్ వద్ద శుక్రవారం ఒక వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాజీపేట జీఆర్‌పీ ఎస్‌ఐ జితేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట విష్ణుపురికి చెందిన సుమారు 32 ఏళ్ల వయస్సు గల వన్నాల రాజు హన్మకొండలోని ఒక హోటల్‌లో వేటర్‌గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా రాజు మద్యానికి అలవాటుపడి తరచుగా ఇంట్లో గొడవ పడుతుండేవాడు. 20 రోజుల క్రితం గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నాకి పాల్పడి ప్రాణాలతో బయటపడ్డాడు. భార్య ఓటు వేయడానికి వెళ్లగా రాజు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీ ఎం ఆసుపత్రి మార్చురికి తరలించి కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.