కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి మృతి చెందాడు.
అనంతపురం: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులగట్ల గ్రామానికి చెందిన భీమ్‌రెడ్డి(32) గత నెల 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటినుంచి బళ్లారి లోని విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
(రాయదుర్గం)