కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం చోటుచేసుకుంది.
వరంగల్ : కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్లోని వల్లభనగర్‌లో నివాసముంటున్న కొమురయ్య(42), పద్మ(38)లు కుటుంబ సమస్యలతో తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి చెందిన ఇద్దరూ గురువారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.