కుటుంబ కలహాలతో ఏఆర్ కానిస్టేబుల్ పవన్‌కుమార్(29) ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కడపకు చెందిన ఆయన 2009 నుంచి ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
పులివెందుల : కుటుంబ కలహాలతో ఏఆర్ కానిస్టేబుల్ పవన్‌కుమార్(29) ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కడపకు చెందిన ఆయన 2009 నుంచి ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లింగాల మండలం గుణకణపల్లెకు చెందిన ఫ్యాక్షన్ నాయకుడు కష్ణారెడ్డికి గన్‌మెన్‌గా ప్రభుత్వం పవన్‌కుమార్‌ను నియమించింది. అప్పటి నుంచి పని చేస్తున్న ఆయన కుటుంబ కలహాలతో కలత చెంది ఆదివారం సాయంత్రం రెండు సీసాల దగ్గు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి, ఎలాంటి ప్రమాదం లేదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.