చెన్నేకొత్తపల్లి : మండలంలోని యర్రంపల్లిలో కుటుంబకలహాతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. మండలంలోని సోమందేపల్లికి చెందిన విజయలక్ష్మి(28)కి చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామానికి చెందిన నాగేంద్రతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో 8 తులాల బంగారు. రూ. 2 లక్షల నగదు ఇచ్చామని మృతురాలి తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, గంగాప్రసాద్‌లు తెలిపారు. అయితే తరచూ తమ కుమార్తెను భర్తతో పాటు అత్తమామలు వేధింపులకు గురిచేసే వారన్నారు. తమ కుమార్తెను వారే చంపి ఉరివేసి ఉంటారని వారు ఆరోపించారు. తమకుమార్తె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
యర్రంపల్లిలో మరొకరు..
మండలంలోని యర్రంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, చిన్నవెంకట్రాముడు దంపతుల కుమార్తె నాగమణి( 22)ని ఇదే మండలంలోని ముష్టికోవెలకు చెందిన ఈశ్వరయ్యతో ఏడాది క్రితం వివాహం చేశారు. వారు సోమందేపల్లి మండలంలో మగ్గం పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే కొన్ని నెలలుగా భర్త వేధింపులు అధికం అయ్యాయని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇంటి ఎవరూ లేని సమయంలో లుంగీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ అని వారు తెలిపారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ సంఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
Published Sun, Jul 9 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM
Advertisement
Advertisement