woman suicides
-
సెల్‌ఫోన్ సంభాషణలే ప్రాణాల మీదకు తెచ్చాయా.?
ఇంజనీరింగ్ చదువుకున్నారు. తల్లిదండ్రులను ఎదురించి కోరుకున్న వారిని పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు వివాహితల జీవితాలు అర్ధంతరంగా ముగియడానికి కారణాలు ఏమిటి.? బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారా? లేక నమ్మినవారి చేతిలో హతమయ్యారా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకడం లేదు. సాంకేతిక విప్లవంగా చెప్పుకుంటున్న సెల్‌ఫోన్ ఇద్దరి జీవితాల్లో కల్లోలానికీ, చివరికి వారి ప్రాణాలను బలితీసుకుందనే అనుమానాలువ్యక్తం అవుతున్నాయి. కోదాడ: కోదాడలో సోమవారం వెలుగుచూసిన వేర్వేరు సంఘటనల్లో అనుమానాస్పదంగా మృతిచెందిన వెంపటి జయశ్రీ (24) మాధవి (23)ల మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామాలు, నేపథ్యం వేరైనప్పటికీ ఇద్దరి మరణానికి కారణం ఒకటేనని తెలుస్తోంది. మంగళవారం కోదాడ ప్రభుత్వ వైద్యశాల వద్ద జయశ్రీ తల్లి ధనలక్ష్మి మాత్రం తన కుమార్తెను భర్త శ్రావణ్, అత్త మామలు వేధించి ప్రాణాలు తీశారని ఆరోపించారు. మాధవి భర్త సతీష్ కూడా వంశీకృష్ణ వేధించి తనభార్యను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ప్రాణాలమీదకు తెచ్చిన సెల్‌ఫోన్... కోదాడలో ఇంజనీరింగ్ చదువుకున్న జయశ్రీ పట్టణానికి చెందిన శ్రావణ్‌ను ప్రేమించి..పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. చదువుకునే రోజుల్లో క్లాస్మేట్ అయిన ఓ మిత్రుడు బెంగళూరులో ఉంటున్నాడు. ఇటీవల అతను తరచు జయశ్రీతో ఫోన్లో మాట్లాడుతున్నాడని సమాచారం. ఈ విషయమై భర్తకు జయశ్రీకి చిన్నపాటి గొడవలు అవుతున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకుని తరచు వేధిస్తున్నాడని ఆమె తల్లి పేర్కొంటోంది. అంతే కాక విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం జయశ్రీతో ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తికి శ్రావణ్ ఫోన్ చేసి ఇక తన భార్యకు ఫోన్ చెయ్యవద్దని వార్నింగ్ ఇవ్వడమేగాక కోదాడలో ఉంటున్న అతని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఫోన్ సంభాషణల రికార్డు తనవద్ద ఉందని శ్రావణ్ తరుచు బెదిరిస్తున్నాడని జయశ్రీ తల్లిదండ్రుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో జయశ్రీ ఒత్తిడికి లోనైందా? లేక ఇతర కారణాలు ఏమై ఉంటాయన్నది పోలీసుల విచారణలో తేలనుంది. తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వరకట్నం కోసం వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జయశ్రీ కాపురంలో ఇంత కల్లోలానికి, ప్రాణాల మీదకురావడానికి సెల్‌ఫోనే కారణమని బంధువులు అంటున్నారు. మాధవి మరణానికి కూడా..? కోదాడలోని షిర్డీనగర్‌లో సోమవారం వెలుగుచూసిన మాధవి అనుమానాస్పద మరణం వెనుక కూడా సెల్‌ఫోన్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. వత్సవాయికి చెందిన మాధవి ఖమ్మం జిల్లాకు చెందిన సతీష్‌తో నెలన్నర క్రితమే వివాహం చేసుకుంది. ఇద్దరి ఇంటిపేర్లు ఒకటే ఉన్నాయని తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా కష్టపడి పైకి వచ్చి, విద్యుత్ ఏఈ ఉద్యోగం సంపాదించిన సతీష్‌నే పెళ్లి చేసుకుంటానని కోరి చేసుకుందని బంధువులు అంటున్నారు. కానీ చదువుకునే రోజుల్లో పరిచమైన వంశీకృష్ణతో గతంలో తరచు ఫోన్లో మాట్లాడింది. వాటిని అడ్డుపెట్టుకుని మాధవిని వేధించడమేగాక ఫోన్ సంభాషణలను భర్తకు పంపుతానని బెదిరించాడని, దాని విషయం మాట్లాడడానికే ఆమె కోదాడకు వచ్చి ఉంటుందని బంధువులు అంటున్నారు. భర్త సతీష్ మాత్రం వంశీకృష్ణ వేధిస్తున్నాడని తనకు కూడా చెప్పిందని, అతనిపై గతంలో కేసు కూడా పెట్టిందని అంటున్నాడు. తన భార్య హత్యకు వంశీకృష్ణ కారణమని అతను ఆరోపిస్తున్నాడు. ఇదీలా ఉండగా సోమవారం కోదాడకు వచ్చిన మాధవి తన మరిదిని ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద ఉండమని ఆటోలో షిర్డీనగర్‌కు వెళ్లింది. అక్కడ వంశీకృష్ణ ఒక్కడే ఉన్నాడని ఫోన్ విషయమై వారు గొడవ పడుతుండగా అతని భార్య వచ్చిందని.. దీంతో తగాదా పెద్దదై భార్యభర్తలు కలిసి మాధవిని హత్యచేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. మాధవి చనిపోయిన గదిలో ఫ్యాన్‌కూడా లేదని, చున్ని ఆమె బరువును కూడా ఆపదని అందువల్ల ఆత్మహత్య కానే కాదని.. అది ముమ్మాటికీ హత్యేనని బం«ధువులు మంగళవారం ఆస్పత్రి వద్ద రోదిస్తూ ఆరోపించారు. పోస్టుమార్టానికి వైద్యుడు కరువు..! సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఇద్దరు వివాహితలు జయశ్రీ, మాధవిల మృతదేహాలకు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించడానికి వైద్యుడు కరువయ్యాడు. సోమవారం రాత్రి మృతదేహాలను మార్చురీకి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు వైద్యుడు లేకపోవడంతో బం«ధువులు మార్చురీ వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను రప్పించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చివరకు మృతదేహాలను హుజూర్నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. ఈ తతంగం అంతా పూర్తి అయ్యేసరికి సాయంత్రం కావడంతో మృతుల కుటుంభ సభ్యులు, బంధువులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విచారణ జరుపుతున్నాం.. జయశ్రీ, మాధవి మరణాల మిస్టరీని ఛేదించేందుకు విచారణను ముమ్మరం చేశాం. జయశ్రీని వరకట్నం కోసమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రి ఫిర్యాదు చేశారు. మాధవి మృతిపై కూడా ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మాధవి విషయంలో సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశాం. సాధమైనంత త్వరలో ఈ కేసుల మిస్టరీని ఛేదిస్తాం. –సీఐ రజితారెడ్డి, కోదాడ -
వివాహిత ఆత్మహత్య
ముదిగుబ్బ: చిన్నకోట్లకు చెందిన లక్ష్మీదేవి (28)అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... లక్ష్మీదేవి, నాగరాజు దంపతులు ధర్మవరం పట్టణంలో నివాసం ఉంటూ మగ్గం పనులు చేసుకునేవారు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న లక్ష్మీదేవి ఇటీవల పుట్టినిల్లు అయిన ముదిగుబ్బ మండలం చిన్నకోట్లకు వచ్చింది. ఆదివారం కడుపునొప్పి భరించలేక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్ఐ రహీం కేసు నమోదు చేసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్య
శింగనమల: బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు.. రోటరీపురం గ్రామానికి చెందిన రాచమల్ల అనిత (28), సురేష్ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ ఎరువుల దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అనిత బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కట్నం కోసం అత్తమామలు వేధించడం వల్లే అనిత ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య
కండ్లపల్లి, (పామిడి): మతిస్థిమితం లేని ఓ వివాహిత ఇంటి గవాచీ కొక్కికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కండ్లపల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసింది. ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాలమేరకు... అనంతపురానికి చెందిన లీలావతికి కండ్లపల్లి గ్రామానికి చెందిన వీరాంజనేయులుతో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లైన ఏడాదికే లీలావతి మతిస్థిమితాన్ని కోల్పోయింది. బుధవారం అర్ధరాత్రి ప్రాంతంలో కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా ఆమె ఉరివేసుకొంది. మృతురాలి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్చురీలో ఆమె మృతదేహాన్ని గుత్తి ఇన్చార్జ్ సీఐ ప్రభాకర్‌గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ ఆమె ఆత్మహత్యపై వివరాలను ఎస్ఐతో అడిగి తెలుసుకున్నారు. -
భర్త మందలించాడని భార్య ఆత్మహత్య
గుమ్మఘట్ట: భర్త మందలించాడని మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఎర్రంపల్లికి చెందిన జయలక్ష్మి (28) మంగళవారం వేరుశనగ పొలంలో కలుపు తొలగించి ఇంటికి వచ్చింది. కాళ్లు శుభ్రంగా కడుక్కోకుండా ఇంట్లోకి అలాగే వచ్చావని భర్త చంద్ర ఆరుబయట మందలించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. రోజంతా పనిచేసినా భర్త చేతిలో చివాట్లు తినాల్సి రావడంతో మనస్తాపానికి గురైన జయలక్ష్మి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. రాయదుర్గం సీఐ చలపతి, గుమ్మఘట్ట ఎస్ఐ హైదర్వలిలు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి,దండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
వేధింపులకు వివాహిత బలి
మరదలిపై మోజుపడ్డ భర్త రెండో పెళ్లి కోసం తీవ్రస్థాయిలో ఒత్తిడి భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య ఓడీ చెరువు: మరదలిని తాను రెండో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోవాలంటూ భర్త వేధించడంతో భరించలేకపోయిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఓడీ చెరువు మండలం గజ్జిబండ తండాలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. గజ్జిబండతండాకు చెందిన మోహన్‌నాయక్‌తో సుహాసిని(23)కి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమార్తె, మూడు నెలల వయసు గల కవల (మగ) పిల్లలు ఉన్నారు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత నుంచి మోహన్‌నాయక్‌కు మరదలి (భార్య చెల్లి)పై కన్నుపడింది. ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడు. భార్య ఒప్పుకోకపోవడంతో తరచూ గొడవపడుతూ వేధించేవాడు. గురువారం రాత్రి ఇద్దరూ మరోసారి ఘర్షణపడ్డారు. భర్త వేధింపులతో మనస్తాపానికి గురైన సుహాసిని పక్కగదిలోకి వెళ్లి పురుగుమందు తాగింది. శుక్రవారం ఉదయం గదిలో నుంచి బయటకు రాకపోవడంతో భర్త తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే మృతి చెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
వివాహిత ఆత్మహత్య
పామిడి: వంకరాజుకాల్వ గ్రామంలో అశ్విని (22) అనే వివాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన మేరకు... గుంతకల్ మండలం దోసలుడికి గ్రామానికి చెందిన అక్క నాగేశ్వరమ్మ కుమార్తె అశ్వినిని పామిడి మండలం వంకరాజుకాల్వకు చెందిన శెట్టి బలిజ రామాంజనేయులు నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం లేదు. రామాంజనేయులు బుధవారం ఉదయాన్నే పొలానికి వెళ్ళాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో భార్య అశ్విని ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఉండటం కనిపించింది. చుట్టుపక్కల వారి సాయంతో ఆమెను కిందకు దింపి పామిడి కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కడుపునొప్పి భరించలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని బంధువులు చెబుతున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
చెన్నేకొత్తపల్లి : మండలంలోని యర్రంపల్లిలో కుటుంబకలహాతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. మండలంలోని సోమందేపల్లికి చెందిన విజయలక్ష్మి(28)కి చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామానికి చెందిన నాగేంద్రతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో 8 తులాల బంగారు. రూ. 2 లక్షల నగదు ఇచ్చామని మృతురాలి తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, గంగాప్రసాద్‌లు తెలిపారు. అయితే తరచూ తమ కుమార్తెను భర్తతో పాటు అత్తమామలు వేధింపులకు గురిచేసే వారన్నారు. తమ కుమార్తెను వారే చంపి ఉరివేసి ఉంటారని వారు ఆరోపించారు. తమకుమార్తె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రంపల్లిలో మరొకరు.. మండలంలోని యర్రంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, చిన్నవెంకట్రాముడు దంపతుల కుమార్తె నాగమణి( 22)ని ఇదే మండలంలోని ముష్టికోవెలకు చెందిన ఈశ్వరయ్యతో ఏడాది క్రితం వివాహం చేశారు. వారు సోమందేపల్లి మండలంలో మగ్గం పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే కొన్ని నెలలుగా భర్త వేధింపులు అధికం అయ్యాయని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇంటి ఎవరూ లేని సమయంలో లుంగీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ అని వారు తెలిపారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ఐ మహమ్మద్‌రఫీ సంఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
రాయదుర్గం టౌన్ : బ్రహ్మసముద్రం మండలం భైరవానితిప్ప గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన శివప్ప భార్య వసంతమ్మ (24) ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగింది. కొద్దిసేపటి తర్వాత బంధువులు గుర్తించి రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందింది. కడుపునొప్పి భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. బ్రహ్మసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్య
కనగానపల్లి (రాప్తాడు) : కనగానపల్లి మండలం బద్దలాపురంలో జింకల నరసింహులు భార్య ఉమక్క(30) అనే వివాహిత శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. ఆమె ఆరు నెలలుగా కడుపు నొప్పితో బాధపడేదన్నారు. పలుచోట్ల వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుటపడకపోగా, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని తనువు చాలించిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
భోగినేపల్లి (రాప్తాడు) : మండలంలోని భోగినేపల్లి గ్రామంలో ఓ వివాహిత బుధవారం రాత్రి కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..రొద్దం మండలానికి చెందిన బంగారు శివమ్మ (27)కు ఆరేళ్ల కిత్రం భోగినేపల్లికి చెందిన పరంధాముడుతో వివాహమైంది. నాలుగేళ్లుగా శివమ్మకు కడుపునొప్పితో బాధపడుతోంది. అనంతపురం, కర్నూలు, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో చికిత్స చేయించుకున్నా ఆమెకు కడుపునొప్పి తగ్గలేదు. బుధవారం సాయంత్రం కూడా కడుపునొప్పి వచ్చింది. గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స చేయించుకుంది. రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ కడుపునొప్పి రావడంతో పశువుల కొట్టంలో దూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను అనంతపురం ప్రభుత్వసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధరణిబాబు తెలిపారు. -
అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి !
- నా చావుకు ఎవరూ కారకులు కాదంటూ సూసూడ్ నోట్ - పెళ్లైన రెండున్నరేళ్లకే ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు - మృతురాలి స్వస్థలం తాడిపత్రి ‘నా చావుకు ఎవరూ కారకులు కాదు. అమ్మా..నాన్న నన్ను క్షమించండి’ అంటూ ఆమె లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె.. మంచి సంబంధం చూసి పెళ్లి చేసిన రెండున్నరేళ్లు కాకనే ఈ ఘోరం జరిగడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. - గుంతకల్లు టౌన్ తాడిపత్రికి చెందిన విజయలక్ష్మీ, సుబ్రమణ్యం దంపతుల ఒక్కగానొక్క కుమార్తె లక్ష్మీదీప్తి(25) వివాహం గుంతకల్లులోని ఎస్‌జేసీ హైస్కూల్ రోడ్ ప్రాంతానికి చెందిన కోటా సరస్వతి, మల్లికార్జున దంపతుల కుమారుడు షణ్ముఖతో 2014 డిసెంబర్ 4న ఘనంగా జరిగింది. వారికి ఏడాదిన్నర వయస్సు కలిగిన జాహ్నవి అనే కుమార్తె కూడా ఉంది. ఏం జరిగిందంటే... లక్ష్మీదీప్తి రోజులాగే ఆదివారం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపిజల్లి ముగ్గులేసేందుకు మిద్దె పై నుంచి కిందకు వచ్చింది. అయితే ఆమె ముగ్గు వేయకుండానే నేరుగా టాయ్లెట్లోకి వెళ్లి నోట్లో గుడ్డలు పెట్టుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. ఆ తరువాత నిప్పంటించుకుంది. కిటికీల్లో నుంచి వస్తున్న పొగలు చూసి కిందకు పరుగున వచ్చిన భర్త సహా అత్త, మామలు అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టులయ్యారు. అప్పటికే లక్ష్మీదీప్తి మంటలో కాలిపోయి మృతదేమమై పడి ఉంది. రంగంలోకి పోలీసులు సమాచారం తెలిపిన వెంటనే అర్బన్ సీఐ రాజా, వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మీదీప్తి మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె రాసి ఉంచిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? లేక అత్తమామల వేధింపుల వల్లే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందా అనే అంశాలపై పోలీసులు ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఏమంటున్నారంటే... తాడిపత్రి నుంచి హుటాహుటిన గుంతకల్లుకు వచ్చిన లక్ష్మీదీప్తి తల్లిదండ్రులు విజయ, సుబ్రమణ్యం మాట్లాడుతూ... తమ అల్లుడు, వియ్యంకుడు ఎలాంటి వేధింపులకు పాల్పడలేదన్నారు. తమ కూతురు ఎందుకింత దారుణానికి ఒడిగట్టిందో అంతు చిక్కడం లేదని విలపించారు. వేరు కాపురం పెట్టాలని తమ కూతురు అడిగిందని, సర్దుకుపోవాలని తామే పదిహేను రోజుల కింద కూతురికి నచ్చచెప్పామన్నారు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని వాపోయారు. మృతురాలి తల్లిదండ్రులను రెవెన్యూ అధికారులు విచారించారు. -
మహిళ బలవన్మరణం
కుందుర్పి (కళ్యాణదుర్గం) : కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో గిరిజమ్మ(36) అనే వివాహిత మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు... మృతురాలి భర్త శ్రీనివాసులు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో చీటికీ మాటికి భార్యతో తరచూ గొడవపెట్టుకునేవాడు. తాగుడుకు డబ్బులు ఇవ్వాలంటూ సోమవారం రాత్రి గొడవపడ్డాడు. దీంతో ఆమె ఇక భరించలేకపోయింది. రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత వంటగదిలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి, వెంటనే ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వివరించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. గిరిజమ్మ మృతికి కారణమైన భర్త శ్రీనివాసులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సత్యనారాయణశాస్త్రీ బాధితురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
వివాహిత ఆత్మ‘హత్య’
- ఉసురు తీసిన అదనపు కట్నం వేధింపులు - పెళ్లైన మూడేళ్లకే ముగిసిన జీవితం ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మరణించింది. ఆత్మహత్య చేసుకుందని మెట్టినింటి వారు అంటుండగా, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పుట్టింటి వారు ఆరోపించారు. ఏదేమైనా కట్నం వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని మాత్రం బలిగొన్నాయి. - తాడిపత్రి రూరల్ తాడిపత్రి గన్నెవారిపల్లె కాలనీలో రాజు భార్య అనూరాధ(25) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లై పట్టుమని మూడేళ్లు కూడా కాలేదని, అప్పుడే భర్త సహా అత్తమామలు కలసి అదనపు కట్నం కోసం వేధించడంతో మనస్తాపం చెందిన ఆమె ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... అప్పు తీర్చడం కోసం అదనపు కట్న వేధింపులు రాజు, అతని తండ్రి వెంకటేసులు కలసి ఇటుకల తయారీ ఫ్యాక్టరీ పెట్టారు. అందుకు రూ.10 లక్షల అప్పు చేశారు. ఆ అప్పును రాజు తండ్రి నడిపి సుబ్బరాయుడు చెల్లించాడు. అప్పటి నుంచి ఆ డబ్బు మీ పుట్టింటి నుంచి తెచ్చివ్వాలంటూ సుబ్బరాయుడు కోడలిపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు భర్త రాజు కూడా వంతపాడాడు. ఇద్దరూ కలసి నిత్యం అనూరాధను కాల్చుకుతినేవారు. వారి వేధింపులు శృతిమించడంతో ఇక తట్టుకోలేకోయిన ఆమె జీవితంపై విరక్తితో ఉరేసుకుంది. ముమ్మాటికీ హత్యే తమ బిడ్డను అదనపు కట్నం కోసం అల్లుడితో పాటు అత్తమామలు వేధిస్తున్న మాట వాస్తవమేనని అనూరాధ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. కచ్చితంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
బ్రహ్మసముద్రం (కళ్యాణదుర్గం) : బ్రహ్మసముద్రం మండలం ఎస్.కోనాపురంలో అనూష(20) అనే వివాహిత గరువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ అబ్దుల్ రహిమాన్ తెలిపారు. కొంతకాలంగా మానసిక వేదనతో సతమతమవుతున్న ఆమె జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. మృతురాలి తల్లి లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
అనారోగ్యంతో మహిళ ఆత్మహత్య
కుందుర్పి (కళ్యాణదుర్గం) : కుందుర్పి మండలం మలయనూరు గ్రామానికి చెందిన బొమ్మక్క (46) అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున మాయదార్లపల్లి ప్రాథమిక పాఠశాల వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ రమణ తెలిపారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఈమె ఇక తనకు జబ్బు నయం కాదని మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వివాహిత ఆత్మహత్య
పెద్దవడుగూరు : మండలంలోని భీమునిపల్లిలో భాస్కర్‌రెడ్డి భార్య ధనలక్ష్మీ(28) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు. పెళ్లై పదేళ్లవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ మంగళవారం మరోసారి గొడవపడ్డారని వివరించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి తండ్రి తిరుపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
పెద్దపప్పూరు (తాడిపత్రి) : రుణదాతల ఒత్తిళ్లు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఒత్తిళ్లు తాళలేక ఓ వివాహిత కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపప్పూరు మండలం నరసాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నరసాపురానికి చెందిన రవీంద్ర చేనేత కార్మికుడు. మగ్గం గిట్టుబాటు కాకపోవడంతో అప్పులపాలయ్యాడు. కుటుంబ పోషణ సైతం భారమైంది. దీంతో అప్పులుఇ చ్చిన వారు ఇంటి వద్దకు వచ్చి ఒత్తిడి తెచ్చేవారు. దీన్ని అవమానంగా భావించిన రవీంద్ర భార్య రుక్మిణి (40) సోమవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగుపొరుగు వారు గమనించి మంటలు ఆర్పి.. తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి కొడుకు, కుమారుడు ఉన్నారు. ఎస్ఐ శ్రీహర్ష సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలంలోని బొందెలదిన్నె గ్రామానికి చెందిన రాజీ (21) ఉరేసుకొని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని మదన అనంతపురం గ్రామానికి చెందిన రాజీకి బొందెలదిన్నె గ్రామానికి చెందిన మల్లికార్జునకు రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. మల్లికార్జున గెర్దావ్ స్టిల్ప్లాంటులో విధులు నిర్వహించేవాడు. విధులకు సక్రమంగా వెళ్లకపోవడంతో తొలగించారు. దీంతో మల్లికార్జున ఖాళీగానే ఉంటున్నాడు. మనస్థాపం చెందిన రాజీ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకుందా? లేక ఏమైన కారణాలు ఉన్నాయా? అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం అత్తింటివారి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. మృతురాలికి సంతానం లేదు. ఎస్ఐ నారాయణరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్య
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్ మండలం లింగదహాళ్ గ్రామానికి చెందిన బోయ రేణుకమ్మ (35) శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న యల్లప్ప ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీరాంశ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. బోయ రేణుకమ్మకు లింగదహాళ్ బోయ కృష్ణయ్యతో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అత్తింటి వేధింపులు తాళలేక
గుంతకల్లు : పెళ్లై ఏడు నెలలు గడువక ముందే ఆమెకు అత్తింటి ఆరళ్లు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని భర్త, అత్తమామలు వేధించడంతో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గుంతకల్లు టూటౌన్ పోలీసులు, బాధిత మహిళ తల్లి ఖాతీజాబీ, అన్న షేక్షావలి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయలచెరువుకు చెందిన ఖాతీజాబీ కుమార్తె రిజ్వానాను ఏడు నెలల క్రితం గుంతకల్లు కోళ్లఫారానికి చెందిన షేక్షావలి, మాబూన్నీల దంపతుల కుమారుడు ఖాయ్యూంకు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో ఖాయ్యూం కుటుంబ సభ్యులు కోరిన మేరకు రూ.2.70 లక్షలు, 12 తులాల బంగారం కట్న కానుకలు ఇచ్చారు. ఖాయ్యూం దుస్తుల వ్యాపారి. రెండు మాసాలపాటు వీరి సంసారం సాఫీగా సాగింది. అనంతరం అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తమామలు రిజ్వానాను తరచూ వేధించేవారు. ఈ క్రమంలో చాలాసార్లు ఆమెపై వీరు దాడిచేశారు. ఏమీ చేయలేని రిజ్వానా విషయాన్ని తల్లి, అన్నతో ఫోన్లో చెప్పుకుని బాధపడుతుండేది. వారి వేధింపులు అధికం కావడంతో మంగళవారం సాయంత్రం ఇంట్లో తన బెడ్రూంలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఎంతపిలిచినా సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలుకొట్టారు. అప్పటికే ఆమె ఫ్యానుకు వేలాడుతూ కన్పించింది. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ ప్రసాద్‌రావు, టూటౌన్ ఎస్ఐ వలీబాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రిజ్వానా బంధువులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపులు తాళలేక.. అనంతపురం సెంట్రల్ : ఉన్నత చదువు..గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం అతడిది. భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయినా మగ పిల్లాడు కావాలంటూ నిత్యం భార్యను వేధించేవాడు. భర్త వేధింపులు భరించలేక ఆ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది. నగరంలో నాల్గవరోడ్డులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. ట్రాన్స్‌కో డిపార్ట్మెంట్లో ఏఈగా పని చేస్తున్న హనుమంతు నగరంలో నాల్గవరోడ్డులో నివాసముంటున్నాడు. హనుమంతుకు ఎనిమిదేళ్ల క్రితం బొజ్జమ్మ(30)వివాహమైంది. వీరికి దివ్య(4), లక్ష్మి(2) సంతానం. అయితే మగపిల్లాడు జన్మించలేదనే కారణంతో నిత్యం హనుమంతు భార్యతో గొడవపడేవాడు. ఈ కారణంగా వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వేధింపులు అధికం కావడంతో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బొజ్జమ్మ చీరతో ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ సీఐ వెంకటేశులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
కుందుర్పి : కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన శిల్ప(24) అనే వివాహిత శనివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు, గ్రామస్తులు తెలిపారు. వారి కథనం ప్రకారం... కర్ణాటక రాష్ట్రం పొన్నసముద్రానికి చెందిన చిక్కీరప్పతో నాలుగేళ్ల కిందట శిల్ప వివాహమైంది. ఏడాది పాటు వారి సంసారం సజావుగా సాగింది. ఆ తరువాత వేరు కాపురం వెళ్దామని భర్తకు చెప్పగా ఆయన ససేమిరా అనడంతో రెండేళ్ల కిందట ఆమె అగిగి పుట్టింటికి చేరింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు భర్త కోరగా పంచాయితీలు జరిగాయి. భర్త, వారి బంధువులు శనివారం కరిగానిపల్లికి వచ్చి శిల్ప తండ్రి రామప్పతో కలసి చర్చించారు. ఎలాగైనా కాపురానికి పంపాలని వారు కోరగా, రామప్ప తన కుమార్తెకు సర్దిచెప్పారు. దీంతో ఆమె భర్త వెంట వెళ్లేందుకు సమ్మతించినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయంత్రం 3 గంటలకు తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని తనువు చాలించిందన్నారు. మృతురాలికి మూడేళ్ల కుమార్తె ఉంది. -
వివాహిత ఆత్మహత్య
కూడేరు : మండల పరిధిలోని ఉదిరిపికొండ తండాలో గురువారం వేకువ జామున వెంకటమ్మ(60) అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ దస్తగిరి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకటమ్మకు భర్త రామన్న, కుమారుడు పెన్నోబులేసు , ముగ్గురు కుమార్తెలున్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన వెంకటమ్మ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపైకప్పుకు తాడుతో ఉరివేసుకుంది. కాసేపటికి ఆమె కోడలు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే తాడుకు వేలాడుతూ కన్పించింది. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎంత పనిచేశావు అమ్మా!
పెళ్లై ఏడేళ్ల తరువాత గర్భం సిజేరియన్ కావచ్చని తెలిపిన వైద్యులు అవగాహన లేమితో భయపడిన గర్భిణి ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత శోకసంద్రంలో గలగల గ్రామం గుమ్మఘట్ట : అమ్మతనం ఓ మధుర జ్ఞాపకం.. ఎన్నో నోముల పుణ్యఫలం.. అందరిలాగే ఆమె పిల్లల కోసం తపించింది. వివాహమై ఏడేళ్లుగా ఎందరో దేవుళ్లకు మొక్కుకుంది. ఆలయాల చుట్టూ తిరిగింది. వైద్యులు చెప్పినట్లుగా నడుచుకుంది. చివరకు గర్భం దాల్చింది. రోజులు గడిచాయి.. నెలలు నిండాయి.... ఇరుగుపొరుగు.. బంధువులు అట్టహాసంగా సీమంతం చేశారు. ప్రసవ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏదో తెలియని ఉద్వేగం. ఆరోగ్య పరీక్షలు చేసిన వైద్యులు సిజేరియన్ తప్పదన్నారు. మరో రెండ్రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండగా.. కడుపుకోతకు భయపడి.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ హృదయ విదారక ఘటన గుమ్మఘట్ట మండలం గలగలలో ఆదివారం చోటు చేసుకుంది. గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన బంగి వన్నూరు స్వామికి అదే గ్రామానికి చెందిన బంగి దురుగమ్మ(26)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. సంతానం కలగకపోవడంతో అందరిలా ఆమె ఆలయాలచుట్టూ, ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. ఎంతో డబ్బు ఖర్చు చేసుకుంది. ఏడేళ్ల తర్వాత ఆమె గర్భందాల్చింది. లేకలేక సంతానం కలుగుతోందని తెలిసి ఎంతో సంబరపడింది. బంధువులు, ఇరుగు పొరుగు వారందరూ వచ్చి సీమంతం కూడా ఘనంగా జరిపించారు. నెలలు పూర్తికావడంతో నాలుగు రోజుల క్రితం కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంది. మరో రెండు, మూడురోజుల్లో కాన్పు అయ్యే అవకాశం ఉంది. బిడ్డకూడా ఆరోగ్యంగా ఉన్నాడు. సిజేరియన్ తప్పనిసరి అని చెప్పడంతో ఆమె భయపడింది. కడుపుకోస్తారేమోనని బెంగతో శనివారం అర్ధరాత్రి తన తల్లి మారెక్క నిద్రిస్తుండగా వరండాలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుంది. మంటల దాటికి తట్టుకోలేక కేకలు పెట్టింది. ఆసమయంలో ఇరుగుపొరుగువారు పోగై మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆమెను వెంటనే రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా అంతలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో గలగల గ్రామం విషాదంలో మునిగిపోయింది. ‘దేవుడా ఎంత పనిచేశావయ్యా’.. అంటూ మృతురాలి తల్లి , బంధువులు రోదించడం అందరి కంట కన్నీరు తెప్పించింది. తహసీల్దార్ ఆఫ్జల్‌ఖాన్ ఆధ్వర్యంలో మృతదేహానికి పంచనామా చేశారు. ఈఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హైదర్‌వలి తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
అనంతపురం : నగరంలోని తపోవనం ప్రాంతంలో నివాసం ఉంటున్న వెంకటరమణమ్మ (45) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం మద్దులచెరువుకు చెందిన సూర్యనారాయణరెడ్డి, వెంకటరమణమ్మ దంపతులు. అనంతపురానికి వలస వచ్చిన వీరు తపోవనం బైపాస్ సర్కిల్లో హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి జీవన్‌రెడ్డి, కల్పన సంతానం. కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నాడు. వెంకటరమణమ్మ తండ్రి నారాయణరెడ్డి గతేడాది డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటినుంచి ఆమె బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన వెంకటరమణమ్మ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి భర్తకు సమాచారం అందించారు. ఆయనతో పాటు స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ సాగర్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వివాహిత ఆత్మహత్య
గుత్తి : గుత్తిలోని సీపీఐ కాలనీకి చెందిన ఉరుకుందమ్మ(34) అనే వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చాంద్‌బాషా తెలిపారు. ఆయన కథనం మేరకు... బేల్దారి పని చేసే భర్త మల్లికార్జున తాగుడుకు బానిసయ్యాడు. తాగేందుకు అప్పులు సైతం చేశాడు. వాటిని తీర్చేందుకు ఒత్తిడి పెరగడంతో భార్యను వేధిస్తున్నాడు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె చివరకు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని సోదరునికి ఫోన్ చేసి తెలిపింది. ఇంట్లో భర్త లేకపోగా, పిల్లలను బయటకు పంపి ఆ తరువాత ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సోదరుడు ఇంటికొచ్చే సరికే ఆమె ఉరికి వేలాడుతుండడంతో ఆగమేఘాల మీద కిందకు దింపి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతురాలికి విశ్వనాథ్, ఉషా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చాంద్‌బాషా తెలిపారు. -
ఉసురు తీసిన వేధింపులు
అదనపు కట్నం కోసం ఒత్తిళ్లు... గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్ మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య అదనపు కట్నం వేధింపులు మరో యువతి ఉసురు తీశాయి. మెట్టినింటి వారి నుంచి పెరుగుతున్న వేధింపులు.. ఛీత్కారాలు భరించలేక ఆ యువతి పుట్టింటిలో ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన పది నెలలకే మృత్యుఒడికి చేరింది. ఈ ఘటన కూడేరు మండలం ముద్దలాపురంలో మంగళవారం జరిగింది. కూడేరు (ఉరవకొండ) : ముద్దలాపురానికి చెందిన గొల్ల నారాయణస్వామి, నరసమ్మ దంపతుల ఏకైక కుమార్తె గొల్ల శ్వేత లక్ష్మి(23)కి ధర్మవరానికి చెందిన లక్ష్మిదేవి కుమారుడు రమేష్‌తో 2016 మార్చి 18న వివాహమైంది. పెళ్లి సమయంలో 12 తులాల బంగారు, రూ.లక్ష నగదు కట్నకానుకల కింద అందజేశారు. రమేష్ ఫైనాన్స్ కంపెనీలో క్యాషియర్. ఇతనికి పద్మావతి, తులసితో పాటు మరో అక్క ఉన్నారు. రెండు నెలలపాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత నుంచి తల్లి, అక్కల మాట విని రమేష్ అదనపు కట్నం కోసం శ్వేతలక్ష్మిని వేధించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో శ్వేతలక్ష్మి గర్భం దాల్చింది. అదనపు కట్నం మోజులో పడిన మెట్టినింటి వారు బలవంతంగా ఆమెకు అబార్షన్ చేయించారు. డబ్బు, బంగారం అదనంగా తీసుకొస్తావా లేదా అంటూ ఇబ్బందులకు గురి చేసేవారు. తినే అన్నం ప్లేటును లాక్కొని మరీ హింసించేవారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ అదనపు కట్నం విషయాన్ని శ్వేతలక్ష్మి తన పుట్టింటి వారికి తెలిపింది. మరో 9 తులాల బంగారు, రూ.లక్ష నగదు ఇస్తేనే తాను సంతోషంగా మెట్టినింటిలో ఉండగలను అని తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు మెట్టినింటి వారితో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్ది చెప్పారు. అయితే కొద్దిరోజులకే తిరిగి మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. ‘వేరే చోట ఎక్కువ కట్నం ఇస్తామన్నా నిన్ను తక్కువ కట్నంతో చేసుకున్నాం. అదనంగా కట్నం తీసుకురాల్సిందే’నని మెట్టినింటి వారు పట్టుపట్టారు. ఇలానే కొద్దిరోజులు గొడవలతోనే కాపురం జరుగుతూ వచ్చింది. మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు వేధింపులు ఎక్కువ కావడంతో నాలుగు నెలల క్రితం అనంతపురంలోని మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి శ్వేతలక్ష్మి పుట్టింట్లోనే ఉంటోంది. గొడవలు లేకుండా కాపురం చేసుకోవాలని పోలీసులు రమేష్‌కు సూచించారు. కానీ అతడు కాపురానికి మాత్రం తీసుకెళ్లలేదు. ఆశలు ఆవిరయ్యాయి వైవాహిక జీవితం ఒడిదుడుకులకు లోనవడం, అదనపు కట్నం మోజులో పడి భర్త తనను కాపురానికి తీసుకెళ్లకపోవడం, బలవంతంగా గర్భస్రావం చేయించడంపై శ్వేతలక్ష్మి మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంటి పక్కనే ఉన్న బాత్రూమ్లో ఉరి వేసుకుంది. కాసేపటి తర్వాత తల్లి వచ్చినప్పటికీ అప్పటికే శ్వేతలక్ష్మి మృతి చెంది ఉంది. సీఐ శివనారాయణస్వామి, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
వివాహిత ఆత్మహత్య
కదిరి టౌన్ : పట్టణంలోని నిజాంవలి కాలనీకి చెందిన అమ్మాజాన్ (38) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రాజేష్ తెలిపిన మేరకు... అమ్మాజాన్ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేది. నొప్పి తీవ్రం కావడంతో మంగళవారం ఇంట్లోనే విషపుద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారకస్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు గమనించి కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
లేపాక్షి : మండలంలోని కొండూరుకు చెందిన రామకృష్ణ భార్య అశ్వర్థమ్మ(35) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీధర్ గురువారం తెలిపారు. ఆమె తరచూ కడుపునొప్పితో బాధపడేదన్నారు. ఈ క్రమంలో నాటి రాత్రి నొప్పి ఎక్కువ కావడంతో భరించలేక ఇంటి పైకప్పునకు ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. మృతురాలికి కుమారుడు(12), కుమార్తె(10) ఉన్నారు. మృతురాలి తండ్రి వెంకటరమణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సంతానం కలగలేదని వివాహిత ఆత్మహత్య
కంబదూరు : సంతానం కలగలేదని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రాంపురానికి చెందిన మధుతో లక్ష్మిదేవి(24)కి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. సంతానం భాగ్యం కలగలేదని ప్రతిరోజూ బాధపడుతుండేది. ఇక పిల్లలు పుట్టరేమోనని జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ నరసింహుడు కేసు నమోదు చేసుకున్నారు. -
కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య
బుక్కపట్నం : మండలంలోని గూనిపల్లిలో ఓ వివాహిత కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు.. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి భార్య ఊహ(24) తరచూ కడుపునొప్పితో బాధపడుతుండేది. అయితే సోమవారం నొప్పి అధికం కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడి ఉంది. స్కూల్ నుంచి వచ్చిన వారి పిల్లలు గమనించి చుట్టుపక్కల వారికి చెప్పగా వారు బాధితురాలిని బత్తలపల్లి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఊహ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యతీంద్ర తెలిపారు. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
యువతి బలవన్మరణం
కదిరి టౌన్ / అమడగూరు : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. కదిరి పట్టణంలోని నిజాంవలి కాలనీలో హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న అబ్దుల్ మునాఫ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మునాఫ్ భార్య బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లి ఇటీవల తిరిగొచ్చింది. తరచూ కుటుంబ కలహాలతో గొడవపడేవారు. కొన్నాâýæ్ల కిందట స్వగ్రామం అమడగూరు మండలం కస్సముద్రంలో వ్యవసాయ పనుల నిమిత్తం కుటుంబ సభ్యులు వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రెండో కుమార్తె నగీనా (20) ఇంట్లోనే విషపుద్రావకం తాగింది. అపస్మారకస్థితిలో పడి వున్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఓడీచెరువు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే నగీనా మృతి చెందింది. కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న తల్లిదండ్రులు.. తనకు పెళ్లి చేస్తే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతారని, ఇది ఇష్టం లేకే నగీనా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
ఉసురు తీసిన కట్నం వేధింపులు
పుట్టపర్తి అర్బన్ : అదనపు కట్నం జ్వాలలకు వివాహిత బలైంది. పుట్టింటికి పంపించేసి.. డబ్బు తీసుకురాకపోతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవచ్చని బెదిరించడమే కాకుండా ఆమెపై లేనిపోని అభాండాలు వేశారు. ఈ అవమాన భారాన్ని భరించలేక ఆమె పుట్టింట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువుకు చెందిన రైతు బత్తల రామచంద్ర, నారాయణమ్మ దంపతుల చిన్న కుమార్తె జయమ్మ (32)కు కదిరి పట్టణంలోని కుటాగుళ్లలోని సత్యనారాయణ, శివమ్మ దంపతుల కుమారుడు రమేష్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో వధువు తల్లిదండ్రులు రూ.25 వేల నగదు, ఐదు తులాల బంగారు కట్నం కింద ఇచ్చారు. ఏడాది తర్వాత రమేష్ తిరుపతికి మకాం మార్చాడు. అక్కడే చీరల షాపులో పనిచేస్తూ భార్యనుప పోషించుకునేవాడు. డబ్బు అవసరమైనపుడల్లా భార్య ద్వారా ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకునేవాడు. ఈ క్రమంలో సొంతంగా బట్టలషాపు పెట్టుకునేందుకు అదనంగా డబ్బు తీసుకురావాలని తల్లి శివమ్మ, తమ్ముడు సాయితో కలసి వేజయమ్మను వేధించడం మొదలు పెట్టాడు. డబ్బు తీసుకురాలేదన్న కారణంతో ఆరు నెలల కిందట ఆమెను పుట్టింటికి పంపించేశాడు. అప్పటి నుంచి కుట్టుమిషన్ కుడుతూ తల్లిదండ్రుల వద్దే ఉండిపోయింది. గత ఆదివారం మరిది సాయి మొహర్రం వేడుకలకు వచ్చి.. ఒదినపై లేనిపోని అభాడాలు వేసి.. డబ్బు తీసుకురాకపోతే తమ ఇంటికి రావద్దని చెప్పి వెళ్లిపోయాడు. ఇవన్నీ అవమానంగా భావించిన జయమ్మ సోమవారం రాత్రి 11 గంటలకు ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రూరల్ ఎస్ఐ రాఘవరెడ్డి సిబ్బందితో గ్రామానికి చేరుకొని మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త రమేష్, అత్త శివమ్మ, మరిది సాయిలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
మహిళ ఆత్మహత్య
గుత్తి రూరల్ : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బోడబండ తండాకు చెందిన వెంకటమ్మ(28)అనే మహిళ కడుపునొప్పి తాళలేక గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోడబండ గ్రామానికి చెందిన వెంకటమ్మ కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతుండేది. వైద్యం చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కు కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని జంతులూరులో ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు జంతులూరు గ్రామానికి చెందిన యంగప్ప, నారాయణమ్మల కుమార్తె వసుంధర (22) ముదిగుబ్బ మండలం పాల్యం గ్రామానికి చెందిన హరికి ఇచ్చి ఆరునెలల క్రితం పెళ్లి చేశారు. అయితే వసుంధరకు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఇందులో భాగంగానే తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. శుక్రవారం కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటరి జీవితం వద్దనుకుని...
మనిషిని భయపెట్టే సంకేతాలు నాలుగు. అందులో ఒంటరి జీవితం ఒకటి. వైవాహిక జీవితంలో పిల్లలు కలగకపోగా, జీవితాంతం తోడూనీడగా ఉంటాడనుకున్న భర్త మరణించడంతో ఆమె ఒంటరిదైంది. కూలినాలీ చేసుకుంటూ నాలుగేళ్లుగా ఎలాగోలా నెట్టుకువచ్చిన ఆమె ఇక ఒంటరితనాన్ని భరించలేకపోయింది. జీవితంపై విరక్తి పెంచుకుంది. చివరకు బలవన్మరణానికి పాల్పడింది. చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన జయరాం భార్య ప్రమీల(32) బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుందని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... కొత్తచెరువుకు చెందిన ప్రమీల వివాహం బసంపల్లికి చెందిన జయరాంతో కొన్నేళ్ల కిందట అయింది. వారికి పిల్లలు లేరు. భర్త నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఆమె కూలి పనులకు వెళ్లి వచ్చిన అరకొర డబ్బుతో కాలం గడిపేది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇంట్లోనే ఆమె ఉరేసుకుని తనువు చాలించింది. బుధవారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఎస్ఐకు సమాచారం అందించారు. ఆయన తమ సిబ్బందితో కలసి గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఇరుగుపొరుగు వారిని విచారించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యాయత్నం కదిరి టౌన్ : కడుపునొప్పి తాళలేక తలుపులకు చెందిన ఓ యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. చిన్నప్ప కుమారుడు కిరణ్‌బాబు అవివాహితుడు. అయితే కొన్నాళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నొప్పి అధికం కావడంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అపస్మార క స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే వైద్యచికిత్సల నిమిత్తం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
కట్నం వేధింపులతో ఆత్మహత్య
కుందుర్పి : వరకట్న వేధింపులు, భర్త, అత్త పెట్టే చిత్రహింసలు భరించలేక బెస్తరపల్లికి చెందిన చంద్రకళ (29) ఆదివారం ఉదయం పుట్టినింటిలో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... బెస్తరపల్లికి చెందిన వడ్డె నారాయణమూర్తి మూడో కూతురు చంద్రకళ (29)కు కర్ణాటక మాగడి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి లీలావలి కుమారుడు జగన్నాథ్‌తో గత ఏఫ్రెల్ 4న ఘనంగా పెళ్లి జరిపించారు.కట్నకానుకల కింద 4 తులాల బంగారం, రూ. 25 వేల నగదును కానుకగా ఇచ్చారు. అదనపు కట్నం కోసం వేధింపులు ఏప్రిల్ 12న మెట్టినిల్లు మాగడికి వెళ్లిన చంద్రకళకు అదనపు కట్నం తీసుకురావాలని భర్త జగన్నాథ్, అత్త లీలావతి రోజూ వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తుండడంతో తనను చంపుతారనే భయంతో జూన్ 2న పుట్టినిల్లు బెస్తరపల్లి వచ్చి తండ్రి మూర్తితో కలిసి కుందుర్పి పోలీస్షే్టషన్లో వరకట్న వేధింపులు, హత్యాయత్నం కింద భర్త జగన్నాథ్ అత్త లీలావతిపై కేసు పెట్టారు. దీంతో పోలీసులు జగన్నాథను 22 రోజులు రిమాండ్‌లో కూడా పెట్టారు. ఇటీవల విడుదలైన జగన్నాథ్, తల్లి వారం రోజుల క్రితం పోలీస్షే్టషన్కు వచ్చిన భార్య చంద్రకళను దుర్భాషలాడుతూ నాకు నీవు అవసరం లేదని త్వరలోనే వేరేపెళ్లి చే సుకుంటానని చెప్పాడు. ఎనిమిదేళ్లక్రితం తల్లిభాగ్యమ్మ చనిపోగా తండ్రి, తమ్ముడితో ఉంటున్న చంద్రకళకు భర్త వేధింపులు తోడై మనోవేదనతో కుంగిపోయేది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతిపై తండ్రి మాట్లాడుతూ ’’ ఆదివారం తాను సొంతపనుల నిమిత్తం కళ్యాణదుర్గం వెళ్లగా తన కుమారుడు అనిల్‌కుమార్ (పెళ్లి కాలేదు) వ్యవసాయ తోటలోకి వెళ్లి ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చాడు. దూలానికి ఉరివేసుకొని వేలాడుతున్న చంద్రకళను చూసి విషయాన్ని ఫోన్లో చెప్పాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. -
యువతి ఆత్మహత్య
నల్గొండ: ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహిత ఆత్మహత్య
కృష్ణా: ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో మరియమ్మ అనే మహిళ శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడు లైంగికంగా తనను వేధిస్తున్నాడని మరియమ్మ మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు పట్టించుకోలేదనే వాదన వినిపిస్తోంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళ ఆత్మహత్య
ఆళ్లగడ్డ (కర్నూలు): కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎల్ఎమ్ కాలనీలో శనివారం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన సుజాత (29) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సుజాతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సమస్యలతో శనివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అనారోగ్యంతో యువతి ఆత్మహత్య
కల్లూరు: కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో ఓ యువతి అనారోగ్యం కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గాయిత్రి (19) అనే యువతి పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. అయితే ఆదివారం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో భరించలేక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. -
మహిళ ఆత్మహత్య
కంచికచర్ల (కృష్ణా జిల్లా): కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం దండేలపిల గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రవి ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య త్రివేణి (27), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, బుధవారం రాత్రి రవి భార్య, తల్లి ఇద్దరు గొడవ పడ్డారు. ఇది చూసి మనస్తాపం చెందిన రవి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో భార్య త్రివేణి, భర్త రవి ఆచూకీ కోసం బంధువులందరికీ ఫోన్లు చేసి విషయం అడిగింది. అయితే, భర్త రాత్రి ఇంటికి రాకపోవడం, బంధువుల ఇంటికి కూడా వెళ్లకపోవడంతో త్రివేణి భయాందోళనకు గురైంది. తన భర్త ఏమైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో గురువారం తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంచించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఇప్పటి వరకు భర్త ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.