కల్లూరు: కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో ఓ యువతి అనారోగ్యం కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గాయిత్రి (19) అనే యువతి పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. అయితే ఆదివారం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో భరించలేక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.