లేపాక్షి : మండలంలోని కొండూరుకు చెందిన రామకృష్ణ భార్య అశ్వర్థమ్మ(35) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్ గురువారం తెలిపారు. ఆమె తరచూ కడుపునొప్పితో బాధపడేదన్నారు. ఈ క్రమంలో నాటి రాత్రి నొప్పి ఎక్కువ కావడంతో భరించలేక ఇంటి పైకప్పునకు ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. మృతురాలికి కుమారుడు(12), కుమార్తె(10) ఉన్నారు. మృతురాలి తండ్రి వెంకటరమణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.