భర్త మందలించాడని భార్య ఆత్మహత్య | woman suicides in errampalli | Sakshi
Sakshi News home page

భర్త మందలించాడని భార్య ఆత్మహత్య

Published Wed, Aug 30 2017 11:06 PM | Last Updated on Tue, Sep 12 2017 1:23 AM

woman suicides in errampalli

గుమ్మఘట్ట: భర్త మందలించాడని మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఎర్రంపల్లికి చెందిన జయలక్ష్మి (28) మంగళవారం వేరుశనగ పొలంలో కలుపు తొలగించి ఇంటికి వచ్చింది. కాళ్లు శుభ్రంగా కడుక్కోకుండా ఇంట్లోకి అలాగే వచ్చావని భర్త చంద్ర ఆరుబయట మందలించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. రోజంతా పనిచేసినా భర్త చేతిలో చివాట్లు తినాల్సి రావడంతో మనస్తాపానికి గురైన జయలక్ష్మి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. రాయదుర్గం సీఐ చలపతి, గుమ్మఘట్ట ఎస్‌ఐ హైదర్‌వలిలు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి,దండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement