ఆళ్లగడ్డ (కర్నూలు): కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎల్‌ఎమ్ కాలనీలో శనివారం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన సుజాత (29) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సుజాతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సమస్యలతో శనివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.