కదిరి టౌన్ : పట్టణంలోని నిజాంవలి కాలనీకి చెందిన అమ్మాజాన్ (38) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ రాజేష్ తెలిపిన మేరకు... అమ్మాజాన్ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేది. నొప్పి తీవ్రం కావడంతో మంగళవారం ఇంట్లోనే విషపుద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారకస్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు గమనించి కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.