కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
కంచికచర్ల (కృష్ణా జిల్లా): కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం దండేలపిల గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రవి ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య త్రివేణి (27), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, బుధవారం రాత్రి రవి భార్య, తల్లి ఇద్దరు గొడవ పడ్డారు. ఇది చూసి మనస్తాపం చెందిన రవి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
దీంతో భార్య త్రివేణి, భర్త రవి ఆచూకీ కోసం బంధువులందరికీ ఫోన్లు చేసి విషయం అడిగింది. అయితే, భర్త రాత్రి ఇంటికి రాకపోవడం, బంధువుల ఇంటికి కూడా వెళ్లకపోవడంతో త్రివేణి భయాందోళనకు గురైంది. తన భర్త ఏమైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో గురువారం తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంచించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఇప్పటి వరకు భర్త ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.