triveni
-
అతి పిన్న వయస్సులో మేయర్‌గా ఎన్నికై త్రివేణి సూరి
సాక్షి,బళ్లారి: బళ్లారి నగర మేయర్ ఎన్నిక ఉత్కంఠభరితంగా ముగిసింది. బుధవారం సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్, ఉపమేయర్ ఎన్నిక జరిగింది. రెండో అవధి కింద నగర మేయర్ స్థానం ఎస్సీ జనరల్‌కు, ఉపమేయర్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో మేయర్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 4వ కార్పొరేటర్ త్రివేణి సూరి, 7వ కార్పొరేటర్ ఉమాదేవి శివరాజ్, 35వ వార్డు కార్పొరేటర్ కుబేరాతో పాటు బీజేపీకి చెందిన 16వ వార్డు కార్పొరేటర్ నాగరత్న ప్రసాద్‌లు మేయర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చెందిన ముగ్గురిలో హైకమాండ్, స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర 4వార్డు కార్పొరేటర్ త్రివేణి ఎంపికకు కార్పొరేటర్లతో కలిసి మద్దతు సూచించడంతో పార్టీ సూచన మేరకు పోటీలో నిలిచిన కుబేరా, ఉమాదేవిలు ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బీజేపీ తరఫున బరిలో నాగరత్న ప్రసాద్ ఇక మేయర్ స్థానానికి కాంగ్రెస్ తరపున త్రివేణి సూరి, బీజేపీ తరపున నాగరత్న ప్రసాద్ పోటీలో ఉండగా ఎన్నికల అధికారి, నగర కమిషనర్, అధికారులు ఎన్నికను నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి త్రివేణి సూరికి సిటీ కార్పొరేషన్‌లోని 39 వార్డులకు గాను 21 మంది కాంగ్రెస్, 5 మంది స్వతంత్ర కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుస్సేన్‌ల ఓటు హక్కుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 28 మంది చేయి ఎత్తి మద్దతు తెలిపారు. ఇక 13 మంది కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, లోక్‌సభ సభ్యుడు దేవేంద్రప్ప ఓటు హక్కుతో బీజేపీ అభ్యర్థినికి 16 మంది మద్దతు దక్కింది. దీంతో మేయర్‌గా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కమేలా త్రివేణి సూరి ఎంపికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉపమేయర్‌గా జానకి ఏకగ్రీవం ఇక ఉపమేయర్ స్థానానికి ఒకే ఒకరు 33వ కార్పొరేటర్ జానకి నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆమె ఉపమేయర్‌గా ఏకగ్రీవంగా ఎంపికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్ స్థానం కోసం ఉదయం నుంచి ఉత్కంఠత నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు పోటీ చేయడంతో చివరి క్షణం వరకు ముగ్గురు తమకే మేయర్ స్థానం కావాలని భీష్మించుకుని కూర్చొన్నారు. అయితే ఎట్టకేలకు కుబేరా, ఉమాదేవిల నామినేషన్ ఉపసంహరించుకునే విధంగా నేతలు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. నూతన మేయర్, ఉపమేయర్లను ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అధికారులు, కార్పొరేటర్లు అభినందించారు. చిన్న వయస్సులో మేయర్‌గా ఎన్నికై న త్రివేణి బళ్లారి నగర మేయర్‌గానే కాకుండా రాష్ట్రంలోని మహానగర పాలికెల్లో ఇప్పటి వరకు అతి పిన్న వయస్సులో మేయర్‌గా ఎన్నికై త్రివేణి సూరి రికార్డు సృష్టించారు. 10వ తరగతి స్థానిక సెయింట్‌ఫిలోమినా స్కూలులో పూర్తి చేసిన అనంతరం పారా మెడికల్ కోర్సు పూర్తి చేసిన తర్వాత అనూహ్యంగా తల్లిదండ్రుల సూచనతో 21 ఏళ్లకే 4వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికై న త్రివేణి 23వ ఏట బళ్లారి నగర ప్రథమ పౌరురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో చిన్న వయస్సులో త్రివేణి సూరికి అదృష్టం వరించి మేయర్ స్థానం దక్కించుకున్నారు. పలువురు ప్రముఖులు పోటీ చేసినా ఆమెనే మేయర్ పదవి వరించింది. తల్లీకూతుళ్లిద్దరినీ వరించిన మేయర్ పదవి మరో విశేషం ఏమిటంటే నూతన మేయర్‌గా ఎన్నికై న త్రివేణి తల్లి సుశీలబాయి కూడా 2018–19లో నగర మేయర్‌గా పని చేశారు. తల్లీకూతుళ్లిద్దరినీ మేయర్ పదవి వరించడం నగరంలో చర్చనీయాంశమైంది. అనంతరం నూతన మేయర్ విలేకరులతో మాట్లాడుతూ నగర మేయర్ అవుతానని తన కలలో కూడా ఊహించలేదన్నారు. తన తండ్రి ప్రోత్సాహంతో గతంలో తన తల్లి సుశీలాబాయి ఐదేళ్లు కార్పొరేటర్‌గా, ఒక ఏడాదిపాటు నగర మేయర్‌గా సేవ చేసిందని గుర్తు చేశారు. మళ్లీ తండ్రి కమేలా సూరి తనను రాజకీయాల్లోకి రావాలని సూచించడంతో ఉద్యోగానికి వెళ్లకుండా నగర కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందానన్నారు. ప్రస్తుతం మేయర్ పట్టం వరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్పొరేటర్లందరి సహకారంతో మేయర్‌గా నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మేయర్ తండ్రి సూరి మాట్లాడుతూ గతంలో తన భార్యకు, ప్రస్తుతం తన కుమార్తెకు మేయర్ పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. -
పెళ్లికి నిరాకరించాడని.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ఖమ్మం: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని మనప్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గురువా రం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన ముదిగొండ త్రివేణి(22) కలకొడిమ గ్రామానికి చెందిన అనంతోజు రవీంద్ర ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరూ బీటెక్ చదివారు. త్రివేణి ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా.. రవీంద్ర ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మభ్యపెట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపం చెందిన త్రివేణి ఈ నెల 27న గడ్డి మందు సేవించింది. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి..) -
రైల్ కార్గో రవాణాలో ‘త్రివేణి’
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కార్గో రవాణాలో విజయవాడ రైల్వే డివిజన్ మరో ఘనత సాధించింది. తక్కువ సమయంలో ఎక్కువ సరుకు రవాణా చేసేలా ఇటీవల మూడు గూడ్స్ రైళ్లను కలిపి ఒకే రైలుగా ‘త్రిశూల్’ పేరుతో విజయవంతంగా నడిపిన విజయవాడ డివిజన్ అధికారులు త్రివేణి మిషన్ పేరిట ఆదివారం నాలుగు అతి పొడవైన గూడ్స్ రైళ్లను నడిపి మరో ఘనత సాధించారు. రెండేసి గూడ్స్ రైళ్లను జతచేసి 118 వ్యాగన్లు ఉన్న ఓ భారీ రైలుగా మలిచారు. ఆ విధంగా ఎనిమిది రైళ్లను నాలుగు భారీ రైళ్లుగా చేసి మూడు గమ్యస్థానాలకు కార్గో రవాణా చేశారు. వాటిలో ఒక రైలును విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా తాల్చేర్ వరకు 900 కిలోమీటర్లు నడిపారు. మరో గూడ్స్ రైలును కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులవారిపల్లి మీదుగా కేశోరామ్ సిమెంట్ కంపెనీకి 645 కిలోమీటర్లు కార్గో రవాణా చేశారు. బీసీఎన్ రేక్స్ గల రెండు భారీ గూడ్స్ రైళ్లను విజయవాడ నుంచి కొండపల్లి వరకు నడిపారు. తద్వారా కార్గో రవాణా సామర్థ్యాన్ని అమాంతంగా పెంచుకుని విజయవాడ రైల్వే డివిజన్ దేశంలోనే గుర్తింపు పొందింది. రోలింగ్ స్టాక్ నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచింది. తద్వారా కార్గో రవాణా వేగం పెరగడంతోపాటు తక్కువ సమయంలో లోడింగ్/అన్లోడింగ్ ప్రక్రియ పూర్తిచేశారు. ఖాళీ అయిన వ్యాగన్లు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరతాయి. సిబ్బంది అవసరం తగ్గడంతోపాటు రైలు మార్గంలో రద్దీ తగ్గడంతో రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. భారీ రైళ్లను సమర్థంగా నిర్వహించినందుకు విజయవాడ రైల్వే డివిజన్ ఉన్నతాధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. -
ప్రేమించాడు.. పెళ్లికి నిరాకరించాడు..
హసన్‌పర్తి: ప్రేమ పేరుతో యువతిని నమ్మించిన ఓ యువకుడు శారీరకంగా దగ్గరై చివరికి పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. హసన్‌పర్తి మండలం సీతంపేటకు చెందిన మంత్రి త్రివేణి (20) నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అదే వీధిలో ఉంటున్న ఆటో డ్రైవర్ గోళ్ల సుమన్ అలియస్ కిట్టు (ప్రస్తుతానికి ఓ షాపులో దినసరి కూలీ)తో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే సుమన్ ఆమెను నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. నెలరోజుల క్రితం త్రివేణి కుటుంబం వేలేరుకు వలస వెళ్లింది. ఇటీవల త్రివేణి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో సుమన్ నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన త్రివేణి శనివారం రాత్రి వేలేరులోని తన ఇంట్లో పురుగుల మందు తాగింది. పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు వేలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీతంపేటకు చెందిన మరో ముగ్గురు యువకులు కూడా ఆత్మహత్యకు కారకులుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
త్రివేణీ బైబ్యాక్.. కేఈసీ క్యూ1- షేర్లు జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మౌలిక సదుపాయాల కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించింది. మరోపక్క ఇదే కాలంలో షుగర్ తయారీ కంపెనీ త్రివేణీ ఇంజినీరింగ్ సైతం ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించింది. దీంతో ఈ రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. కేఈసీ ఇంటర్నేషనల్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో కేఈసీ ఇంటర్నేషనల్ నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 21 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం తక్కువగా రూ. 2207 కోట్లను తాకింది. కోవిడ్-19 కారణంగా పనితీరు ప్రభావితమైనప్పటికీ పూర్తిఏడాదిలో మెరుగైన ఫలితాలు సాధించగలమని ఆశిస్తున్నట్లు కేఈసీ యాజమాన్యం పేర్కొంది. ఇబిటా 22 శాతం నీరసించి రూ. 251 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో కేఈసీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం దూసుకెళ్లి రూ. 293 వద్ద ట్రేడవుతోంది. త్రివేణీ ఇంజినీరింగ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో త్రివేణీ ఇంజినీరింగ్ కన్సాలిడేటెడ్ నికర లాభం 146 శాతం దూసుకెళ్లి రూ. 84 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 921 కోట్ల నుంచి రూ. 1222 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. ఒక్కో షేరుకీ రూ. 105 ధర మించకుండా 2.5 శాతం వాటాకు సమానమైన 61.9 లక్షల షేర్లను బైబ్యాక్ చేసేందుకు బోర్డు ఓకే చెప్పినట్లు త్రివేణీ వెల్లడించింది. ఇందుకు దాదాపు రూ. 65 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో త్రివేణీ ఇంజినీరింగ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 77.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 82 వరకూ ఎగసింది. -
ఇద్దరు వివాహితలు అదృశ్యం!
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్ సిటీ): నగరంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు వివాహితలు అదృశ్యమయ్యారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివి.. కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయింది. మేకలమండి ప్రాంతానికి చెందిన జీ.దుర్గా కూతురు వీ.దివ్య(22) దీపావళి పండుగను పురస్కరించుకొని తల్లిగారింటికి వచ్చింది. శనివారం కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్లను తీసుకొస్తానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన దివ్య తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో వేణు అనే యువకుడిపై అనుమానం ఉందని పేర్కొంటూ ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో గాని 9490616505, 9490616500 నంబర్లలో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. ఇంట్లో చెప్పకుండా వెళ్లి.. ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైంది. జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన ఎన్.రమేష్, త్రివేణిలు భార్యభర్తలు. ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన త్రివేణి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో భర్త ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 5.3 అడుగుల ఎత్తున్న ఆమె ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో గాని 9490616505, 9490616500 నంబర్లలో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. -
నిలిచిపోయిన పోలవరం పనులు
–బకాయిలు ఇవ్వకపోవటంతో పనులు నిలిపివేసిన త్రివేణి సంస్ద –జీతాలు చెల్లించక పోవటంతో విదులు బహిష్కరించిన ట్రాన్స్ట్రాయ్ కార్మికులు పోలవరం: పోలవర ం ప్రాజెక్టు నిర్మాణ పనులు శనివారం నుండి పూర్తిగా నిలిచిపోయాయి.వేగంగా పనులు చేసే త్రివేణి సంస్ద శుక్రవారం మాత్రం నామమాత్రంగా పనులు చేసి,అనంతరం పనులు పూర్తిగా నిలిపి వేసింది.రెండు రోజుల క్రిందటే ప్రదాన కాంట్రాక్ట్ ఏజన్సీ అయిన ట్రాన్స్ట్రాయ్ లో పనిచేస్తున్న సమారు 200మంది కార్మికులు జీతాలు చెల్లించటం లేదంటూ విదులు బహిష్కరించారు.దీంతో పనులు పూర్తిగా నిలాచి పోయాయి.కార్మికులకు మూడు నెలల జీతాలు చెల్లించవలసి ఉంది.ఇదిలా ఉంటే త్రివేణి సంస్దకు సుమారు రూ.70 కోట్ల మేర ట్రాన్స్ట్రాయ్ సంస్ద చెల్లించాల్సి ఉన్నందున త్రివేణి సంస్ద పనులు నిలిపి వేసినట్టు సమాచారం.ఇప్పటివరకు స్పిల్‌వే ఎర్త్‌వర్క్ పనులను త్రివేణి, స్పిల్‌చానల్ పనులను ట్రాన్స్ట్రాయ్ చేస్తూ వచ్చాయి.రోజుకు దాదాపు 50 వేల క్యూ.మీ ఎర్త్‌వర్క్ పనులను త్రివేణి సంస్ద చేసేది.ట్రాన్స్ట్రాయ్సంస్ద కేవలం 15నుండి 20 వేల క్యూ.మీ పనులు మాత్రమే చేసేది.ఇపుడు ఈపనులను కూడా త్రివేణి సంస్దకు అప్పగించి,కేవలం మట్టి తవ్వకానికి సంబందించి అప్రోచ్ చానల్ పనులు చేసేందుకు ట్రాన్స్ట్రాయ్ సిద్దమైంది.దీనిలో బాగంగా 40 డంపర్లను,10 ఎక్సివేటర్స్ను త్రివేణి సంస్దకు అప్పగించింది.ఇకముందు ట్రాన్స్ట్రాయ్ సంస్ద కేవలం అప్రోచ్ చానల్ పనులకు మాత్రమే పరిమితం కానుంది. -
మమ్మీ! దెయ్యం?
చేతనబడి అమ్మ రారమ్మంటే పిల్లలు పరుగెత్తుకు వస్తారు లకలక... అంటే దూరంగా పరుగెత్తుకుపోతారు త్రివేణి ‘లకలక’మన్నప్పుడు పిల్లలు పారిపోయారు ‘మామూలయ్యాను’ రారమ్మంటోందిప్పుడు ‘నిజమేనా’ అన్నట్లున్నాయి వారి చూపులు ఆ చూపులకు సమాధానం ఎవరు చెప్తారు? ‘అమ్మా! నువ్వు బాగయ్యావా!’ భయంభయంగా చూస్తూ అడిగాడు పదేళ్ల వినోద్. ఆ ప్రశ్నతో త్రివేణి ముఖం పాలిపోయింది. దగ్గరకు రమ్మన్నట్లు చేతులు చాచింది. వసంత్ కళ్లలో ఆందోళన. ఒక్క ఉదుటున అమ్మ దగ్గరకు వెళ్లబోతున్న తమ్ముడిని ఆపాడు. వెళ్లొద్దన్నట్లు కళ్లతోనే సైగ చేశాడు. అంతే... త్రివేణి కళ్లు జలపాతాలయ్యాయి. తానే లేచి వెళ్లి కొడుకులిద్దరినీ కౌగలించుకుని బావురుమన్నది. పిల్లలు త్రివేణి దగ్గరకు రావడానికి భయపడుతున్నారు. పగలు ఈ మాత్రమైనా వస్తున్నారు. రాత్రి అమ్మ దగ్గర పడుకోవడానికి భయపడుతున్నారు. ఎప్పుడూ అమ్మపక్కన నేనంటే నేనంటూ వచ్చే పిల్లలు... అమ్మ మీద చేయి వేసుకుని నిశ్చింతగా నిద్రపోయే పిల్లలు... ఇప్పుడు దగ్గరకు రావడానికే భయపడుతున్నారు. తనకేమైంది? త్రివేణికి గతం కళ్ల ముందు మెదిలింది. గడచిన ఏడాది జూలై నెల. ఆరుద్రకార్తె రెండవ మంగళవారం. అనంతపురంలో శీతలయాడి జాతర జరుగుతోంది. బంజారాలకు అది పెద్ద వేడుక. తల మీద బోనాలతో రెండు వందల కుటుంబాలు జాతరలో పాల్గొన్నాయి. బ్యాండ్ మేళం ఊపందుకుంటోంది. త్రివేణి దేహంలో ప్రకంపనలు... బ్యాండు మేళం శబ్దానికి అనుగుణంగా కాళ్లుచేతులు కదలసాగాయి. ఆ తరవాత ఏం జరిగిందో ఆమెకు తెలియదు. మరుసటి రోజు పరామర్శించడానికి వచ్చిన బంధువు ‘‘నువ్వు ఎప్పుడూ డాన్స్ చేయలేదు, నేర్చుకోలేదు కూడా. అయినా బీట్‌కి అనుగుణంగా అడుగులు భలే వేశావు. అయితే అంతలోనే పూనకం వచ్చినట్లు ఊగిపోయావు, దేవత పూనిందా’’ అత్యుత్సాహంతో అడిగిందామె. ఆ ప్రశ్నతోపాటు ఆమె మనసులో మాత్రం ‘దేవత పూనిందా, దెయ్యం పట్టిందా’ అనుకున్నది. అనుమానాన్ని బయటపడనివ్వకుండా ‘హారతి పట్టిన తరవాత మామూలయ్యావు’ అని కూడా చెప్పింది. ‘తనకేమయింది’ మొదటిసారిగా ఓ ప్రశ్న ఆమె మెదడులో. అప్పటి నుంచి వరుసగా వందలసార్లు అదే ప్రశ్న. తనను తాను ప్రశ్నించుకుంటోంది. మధ్యాహ్నం మూడు గంటలు... ఇంట్లో త్రివేణి ఒక్కటే ఉంది. భర్త ఉద్యోగానికి, పిల్లలు స్కూల్‌కీ వెళ్లారు. ఇంట్లో ఏ వైపు నుంచి వస్తోందో కానీ, మల్లెపూల వాసన గుభాళిస్తోంది. ఇల్లంతా మల్లెలతో అందంగా అలంకరించినట్లుంది. ‘మల్లెలు ఎక్కడి నుంచి వచ్చాయి, నేనెప్పుడు అలంకరించాను’ అనే సందేహం తలలో గిర్రున తిరిగే లోపే కళ్లు వలయాకారంగా తిరిగిపోతున్నాయి. ‘లకలకలక’ అంటూ చంద్రముఖి సినిమాలో జ్యోతిక కళ్లు తిప్పినంత వేగంగా తిప్పుతోంది. స్కూలు నుంచి వచ్చిన పిల్లలు తల్లిని అలా చూడగానే భయభ్రాంతులయ్యారు. కొంతసేపటికి ఆమె మామూలయ్యింది. కానీ ఒంట్లో శక్తి అంతా ఎవరో తోడేసినట్లు మంచం మీద వాలిపోయింది. నాలుగైదు గంటలపాటు అచేతనంగా అలా పడి ఉంది. తండ్రి ఇంటికి వచ్చేవరకు భయంతో బిక్కచచ్చిపోయారు పిల్లలు. మెలకువ వచ్చిన తర్వాత త్రివేణికి ఇంటి వాతావరణంలో మార్పు కనిపించింది. మళ్లీ అదే ప్రశ్న... తనకేమైంది? ఇదిలా ఉంటే త్రివేణికి దేవత పూనుతోందని తెలిసిన వాళ్లు ఇంటికి వస్తున్నారు. పూలుపండ్లు తెచ్చి పెట్టి పాదాలకు నమస్కరించి వాళ్ల సందేహాలు అడుగుతున్నారు. అలా ఎవరైనా రాగానే త్రివేణి దేవత పూనినట్లు మారిపోతోంది. మొదట్లో వారానికోసారి పూనిన దేవత, ఇప్పుడు రెండు గంటలకోసారి కనిపిస్తోంది. పూనకం వదిలిన తరవాత ‘బిడ్డలను దగ్గరకు తీసుకోలేని దైవత్వం నాకెందుకు’ అని త్రివేణి కుంగిపోతోంది. ఓ రోజు త్రివేణి ఇంటి ఎదురుగా ఓ మాంత్రికుడు వచ్చి నిలబడ్డాడు. ఎంతకీ కదలడం లేదు. ‘మీ ఇంట్లో ఉన్నది దేవత కాదు, దెయ్యమూ కాదు, శని.’ అంటూ తొలిదెబ్బ వేశాడు. దెయ్యమా, దేవతా అనే సందిగ్ధంలో ఉన్న సంగతి ఈయనకెలా తెలిసింది అనే సందేహంతోపాటు ఆ మాంత్రికుడి మీద నమ్మకం కలుగుతోంది భరత్‌కి. ‘అష్టదిగ్బంధనం చేసి శనిని కట్టి పడేస్తాను’ అంటూ నవధాన్యాలు, నవరత్నాలు, తొమ్మిది కొబ్బరికాయలు, తొమ్మిది రాగిరేకులు, నిమ్మకాయలు తెప్పించాడు. ఇంటి ఆవరణలో నాలుగు మూలలు, నాలుగు దిక్కులతోపాటు ఇంటి మధ్యలో గుంత తీసి వాటిని పూడ్చాడు. భరత్‌కు దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చయ్యాయి. త్రివేణి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది. తనకేదో అయిపోతోందన్న ఆందోళన ఆమెను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఓ రోజు అర్ధరాత్రి నరాలు బిగుసుకు పోతున్నాయి. చాలా సార్లు జనవిజ్ఞానవేదిక వాళ్లు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. తండ్రి తన అత్తింటి వారిని బతిమాలుతున్న సంగతీ గుర్తొచ్చింది. భయంతో తండ్రికి ఫోన్ చేసింది. చచ్చిపోతానేమోనని భోరున ఏడ్చింది. ఇది జరిగిన నెల తర్వాత... చిన్న వాడు ‘అమ్మా నువ్వు బాగయ్యావా’ అని అడిగాడు. మందుల పెట్టె తీసి చూపిస్తూ ‘ఈ మందులన్నీ వేసుకుంటున్నాగా, బాగయిపోయాను. బాగయిపోయానని డాక్టర్ కూడా చెప్పారు’ అని పిల్లలకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తోంది త్రివేణి. ‘ఇంకెప్పుడూ లకలక అనవుగా’ అనుమానంగా అడిగాడు వినోద్. ‘ఇంకెప్పుడూ అనను, కావాలంటే అన్నను అడుగు’ అంటూ పెద్దకొడుకు వసంత్‌ను చూసింది. పెద్దవాడివి కదా, నువ్వయినా అర్థం చేసుకోమనే అర్థింపు ఆమె కళ్లలో. అమ్మకు తగ్గిందోలేదో తెలియకపోయినా అమ్మ కళ్లలో అర్థింపు అర్థమైంది వసంత్‌కి. ‘అమ్మ ఇప్పుడు బాగుంది. భయపడొద్దు’ అని తమ్ముడికి ధైర్యం చెప్పాడు వసంత్. నరాల బలహీనత ఆమెలో మానసిక స్థిరత్వలోపానికి కారణమైంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వల్ల ఆమె మరో పాత్రను ఆవహింపచేసుకోసాగింది. పూనకం వచ్చినట్లయి మరో పాత్రలోకి ప్రవేశించడం, కొంతసేపటికి మామూలవడం, వాతావరణ పరిస్థితులను బట్టి కొత్త పాత్రను ఆవహింపచేసుకోవడం ఇందులో ఉంటుంది. తండ్రి వచ్చి సైకియాట్రిస్ట్‌కు చూపించి మందులు వాడిన తర్వాత రెండు వారాల్లో త్రివేణి పూర్తిగా మామూలైంది. అయితే పిల్లలకు నమ్మకం కుదిరే వరకు ఆమె తల్లి మనసు వేదన తీరదు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి దెయ్యం అన్నారు... దేవత అని కొలిచారు! ఊరి చెరువు కట్ట కింద శ్మశానంలో ఓ మాంత్రికుడు ముగ్గుపోసి మధ్యలో పిండిబొమ్మ పెట్టి కోడిరక్తంతో తర్పణం చేశాడు. చేతబడి పోయిందని ఐదువేల రూపాయలు పట్టుకెళ్లాడు. కానీ త్రివేణిలో మార్పు రాలేదు. ఆంజనేయస్వామికి మొక్కితే దెయ్యాలు పోతాయని ఎవరో చెప్పారు. అది మరో మలుపు అవుతుందని ఆమె ఊహించనే లేదు. ‘ఈ అమ్మాయికి దెయ్యం పట్టలేదు, చేతబడి జరగలేదు. దేవత పూనుతోంద’ని చెప్పాడు పూజారి. ‘దేవత మొదటగా కనిపించింది శీతలయాడి జాతరరోజు. అక్కమ్మగార్లు పూనుతున్నారు’ అని తేల్చేశారు. ‘దేవత పునుతోందా... అయితే నేనేం చేయాలి’ త్రివేణిలో ఆందోళన. ఓ రోజు ఉదయం పూజ పూర్తయ్యేలోపు త్రివేణిలో మార్పు వచ్చేసింది... త్రివేణిని అలా చూస్తూనే ఆమె కాళ్ల మీద పడిపోయాడు భర్త భరత్. ‘నువ్వెవరమ్మా’ అనగానే ‘‘శీతలాదేవిని, అక్కమ్మ దేవతను నేనే. ఈ అమ్మాయి శుచిశుభ్రతతో చక్కగా ఉంది. నేనిక ఈ ఇంట్లోనే ఈమె ఒంట్లోనే ఉంటాను. నువ్వు తాకడానికి వీల్లేదు’’ అంది. భరత్‌కు జీవితం అగమ్యగోచరంగా ఉంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు. ఎవరితోనూ చెప్పుకోకుండా ఉండలేని స్థితి. చేతికి రాగి కడియం వేస్తే దేవత రాదని చెప్పారెవరో. అదీ చేశారు. అయినా మార్పు రాలేదు. -
అడవిలో యువతి అనుమానాస్పద మృతి
మేళ్లచెర్వు: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కోటిలింగాల వద్ద అటవీ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా శనివారం ఉదయం వెలుగు చూసింది. మృతి చెందిన యువతి నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలం బుగ్గమాదారం గ్రామానికి చెందిన ఆవుల త్రివేణి(19)గా గుర్తించారు. త్రివేణి గత ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. కోటి లింగాల వద్ద అటవీ ప్రాంతంలో మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్యచేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మహిళ ఆత్మహత్య
కంచికచర్ల (కృష్ణా జిల్లా): కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం దండేలపిల గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రవి ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య త్రివేణి (27), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, బుధవారం రాత్రి రవి భార్య, తల్లి ఇద్దరు గొడవ పడ్డారు. ఇది చూసి మనస్తాపం చెందిన రవి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో భార్య త్రివేణి, భర్త రవి ఆచూకీ కోసం బంధువులందరికీ ఫోన్లు చేసి విషయం అడిగింది. అయితే, భర్త రాత్రి ఇంటికి రాకపోవడం, బంధువుల ఇంటికి కూడా వెళ్లకపోవడంతో త్రివేణి భయాందోళనకు గురైంది. తన భర్త ఏమైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో గురువారం తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంచించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఇప్పటి వరకు భర్త ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. -
ప్రేమలో గెలిచారా?
ఓ కథలో యువకుడు తన ప్రేయసి కటాక్షం కోసం నిరీక్షిస్తుంటే, ఇంకో కథలో అమ్మాయి సహజీవనమే బెటర్ అనీ, పెళ్లి వద్దనీ చెబుతుంది. మరి రెండు కథల్లో తర్వాత ఏమైందో తెలియాలంటే ‘అగ్నిసాక్షిగా’ చూడాల్సిందే. ఆర్.ఆర్ జరుగుల స్వీయ దర్శకత్వంలో విషు రెడ్డి, ఇషా, నందకిషోర్, త్రివేణి ముఖ్యతారలుగా నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇప్పటి దాకా రాని విభిన్నమైన కాన్సెప్ట్‌ను చూపించనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వంశీ-గణేశ్, సహ నిర్మాతలు: గొట్టిపాటి కోటేశ్వరరావు, పీఏపీ ఆచార్య, పోపూరి నాగేశ్వరరావు. -
అన్నప్రాసన మరుసటి రోజే అనంతలోకాలకు..
గార్ల (ఖమ్మం జిల్లా): అన్నప్రాసన చేసుకున్న మరుసటిరోజే ఆ పాపకు వడదెబ్బ తగిలింది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. గార్ల మండలం బీఆర్ఎన్ తండాకు చెందిన భూక్యా రాజేష్, దేవి దంపతులకు ముగ్గురు పిల్లలు. తొలుత ఇద్దరు కుమారులు. తర్వాత ఆరు నెలల కూతురు త్రివేణి ఉన్నారు. ఆ పాపకు మర్రిగూడెం వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో ఆదివారం అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుభకార్యం జరుపుకున్న సంతోషం ఆ తల్లిదండ్రులకు కొద్ది గంటలు నిలువలేదు. అన్నప్రాసన రోజే ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో పాప వడదెబ్బకు గురైంది. చికిత్స నిమిత్తం ఖమ్మంలో ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున పాప మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆదివారం అన్నప్రాసనకు హాజరై, మరుసటి రోజు పాప అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
అన్నింటా అదే తంత్రం
సాక్షి, మచిలీపట్నం : సార్.. రోడ్డు పక్కన ఒక మృతదేహం రక్తపు మడుగులో ఉంది.. ఏదైనా వాహనం ఢీకొట్టిందో.. ఎవరైనా చంపేసి పడేశారో.. అంతా అయోమయంగా ఉంది.. అంటూ ఎస్.ఐ. తన పైఅధికారికి ఫోన్లో సమాచారం అందించారు. ఎందుకయ్యా అంత టెన్షన్ పడతావ్.. 174 కేసు కట్టు.. శవాన్ని పోస్టుమార్టానికి పంపించి.. పంచనామా నిర్వహించు.. దర్యాప్తులో అతడు ఎలా చనిపోయిందీ తెలుసుకుని కేసు సెక్షన్ మార్పుచేస్తే సరిపోతుంది.. అంటూ ఆ అధికారి ముక్తాయింపు. ..ఇది పోలీస్ శాఖలో మృతుల కేసుల నమోదులో తరచు జరుగుతున్న రచ్చ. అనేక మరణాలపై మిస్టరీ వీడకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పోలీస్ శాఖకు ఐపీసీ సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) అభయ అస్త్రంగా ఉపయోగపడుతోంది. మృతికి కారణాలు తెలియకపోయినా.. సంఘటన జరిగిన తీరు కాస్త క్లిష్టంగా మారినా ఏమాత్రం కంగారుపడకుండా పోలీస్ తంత్రం పనిచేస్తోంది. ఇలా ప్రతిదానికీ అదే తారకమంత్రంగా మారిపోయింది. జిల్లాలో ఈ తరహా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అనేక ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు సైతం పలు కేసులను అనుమానాస్పద మృతిగా నమోదుచేసి అప్పటికప్పుడు తాత్కాలికంగా తమ పని అయిందనిపిస్తున్నారు. తీరా ఆ తరహా కేసులను అటుతరువాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉండడం లేదు. ఫలితంగా అనుమానాస్పద మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడంలో పోలీసులు విఫలమవుతున్నారని చెప్పక తప్పదు. కొన్ని కేసుల్లో బంధువులు రోడ్డెక్కి ఆందోళన చేస్తే పోలీసులు విచారణ చేసి ఐపీసీ 174 కేసులను హత్య కేసుగానో, ప్రమాద మరణంగానో, ఆత్మహత్యగానో నిగ్గు తేల్చుతున్నారు. చాలా అనుమానాస్పద కేసుల్లో అడిగే నాథుడు లేకపోవడంతో పోలీసులు వాటిపై శ్రద్ధ చూపడంలేదన్న అపవాదు కూడా ఉంది. అనుమానాలెన్నో.. జిల్లాలో గత ఏడాది నమోదైన అనుమానాస్పద మృతి కేసులను నిశితంగా గమనిస్తే ఎన్నో అనుమానాలు కలుగుతాయి. నేరుగా ఆత్మహత్యలు చేసుకున్న కేసుల్లో సైతం లోతుగా దర్యాప్తు చేస్తే అందుకు పురిగొల్పిన కారణాలు కనిపిస్తాయి. అనేక మృత్యు ఘటనలను తరచిచూస్తే కేసుల్లో కీలక ఆధారాలు దొరుకుతాయి. అలాంటి కేసులను కొన్నింటిని చూద్దాం... జనవరి 3న పెనుగంచిప్రోలు మండలం వెంకటాపురంలో త్రివేణి అనే యవతి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై అనేక అనుమానాలున్నాయి. జనవరి 24న మచిలీపట్నంలో గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జనవరి 28న కంకిపాడులో ఓ యువకుడు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. జనవరి 29న పెనమలూరులోని సనత్‌నగర్‌లో పనికి వెళ్లిన వీరాచారి అనుమానాస్పద స్థితిలో శవమయ్యాడు. తిరువూరు ప్రాంతంలో ఫిబ్రవరి 26న ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మార్చి 28న బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేటలో బోగిన వీరమ్మ (13), మార్చి 30న ముదినేపల్లి మండలం గురజ దళితవాడలో పులవర్తి రమేష్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఏప్రిల్ 1న పెదపారుపూడిలో వెంకటలక్ష్మి మృతి చెందగా.. దీనిపై అనుమానాలున్నాయంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదేశాల మేరకు అప్పటి ఏఎస్పీ షెముశీ బాజ్‌పాయ్ ఏప్రిల్ 3న విచారణ నిర్వహించారు. విస్సన్నపేట పోలీస్ క్వార్టర్లో కానిస్టేబుల్ భార్య మే 9న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జూన్ 1న నూజివీడులో కట్నం వేధింపులకు అరెళ్లి శ్రీదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణంపైనా అనుమానాలున్నాయి. మే 23న ఇంజనీర్ సోమశేఖర్ పెడనలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బందరుకు చెందిన అతడు దాదాపు పది కిలోమీటర్ల దూరంలోని పెడన బైపాస్ రోడ్డు ప్రాతంలో శవమై కనిపించిన తీరుపై అనేక అనుమానాలున్నాయి. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. ఇలా చెబుతూపోతే జిల్లాలో అనేక అనుమానాస్పద మరణాల వెనుక ఏదో ఒక మిస్టరీ దాగి ఉంటోంది.