నిలిచిపోయిన పోలవరం పనులు
Published Sat, Oct 8 2016 6:45 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
–బకాయిలు ఇవ్వకపోవటంతో పనులు నిలిపివేసిన త్రివేణి సంస్ద
–జీతాలు చెల్లించక పోవటంతో విదులు బహిష్కరించిన ట్రాన్స్‌ట్రాయ్ కార్మికులు
పోలవరం: పోలవర ం ప్రాజెక్టు నిర్మాణ పనులు శనివారం నుండి పూర్తిగా నిలిచిపోయాయి.వేగంగా పనులు చేసే త్రివేణి సంస్ద శుక్రవారం మాత్రం నామమాత్రంగా పనులు చేసి,అనంతరం పనులు పూర్తిగా నిలిపి వేసింది.రెండు రోజుల క్రిందటే ప్రదాన కాంట్రాక్ట్ ఏజన్సీ అయిన ట్రాన్స్‌ట్రాయ్ లో పనిచేస్తున్న సమారు 200మంది కార్మికులు జీతాలు చెల్లించటం లేదంటూ విదులు బహిష్కరించారు.దీంతో పనులు పూర్తిగా నిలాచి పోయాయి.కార్మికులకు మూడు నెలల జీతాలు చెల్లించవలసి ఉంది.ఇదిలా ఉంటే త్రివేణి సంస్దకు సుమారు రూ.70 కోట్ల మేర ట్రాన్స్‌ట్రాయ్ సంస్ద చెల్లించాల్సి ఉన్నందున త్రివేణి సంస్ద పనులు నిలిపి వేసినట్టు సమాచారం.ఇప్పటివరకు స్పిల్‌వే ఎర్త్‌వర్క్ పనులను త్రివేణి, స్పిల్‌చానల్ పనులను ట్రాన్స్‌ట్రాయ్ చేస్తూ వచ్చాయి.రోజుకు దాదాపు 50 వేల క్యూ.మీ ఎర్త్‌వర్క్ పనులను త్రివేణి సంస్ద చేసేది.ట్రాన్స్‌ట్రాయ్‌సంస్ద కేవలం 15నుండి 20 వేల క్యూ.మీ పనులు మాత్రమే చేసేది.ఇపుడు ఈపనులను కూడా త్రివేణి సంస్దకు అప్పగించి,కేవలం మట్టి తవ్వకానికి సంబందించి అప్రోచ్ చానల్ పనులు చేసేందుకు ట్రాన్స్‌ట్రాయ్ సిద్దమైంది.దీనిలో బాగంగా 40 డంపర్లను,10 ఎక్సివేటర్స్‌ను త్రివేణి సంస్దకు అప్పగించింది.ఇకముందు ట్రాన్స్‌ట్రాయ్ సంస్ద కేవలం అప్రోచ్ చానల్ పనులకు మాత్రమే పరిమితం కానుంది.
Advertisement
Advertisement