వేధింపులకు వివాహిత బలి | woman suicides in gajjibanda thanda | Sakshi
Sakshi News home page

వేధింపులకు వివాహిత బలి

Published Fri, Jul 21 2017 10:28 PM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

woman suicides in gajjibanda thanda

మరదలిపై మోజుపడ్డ భర్త
రెండో పెళ్లి కోసం తీవ్రస్థాయిలో ఒత్తిడి
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య


ఓడీ చెరువు: మరదలిని తాను రెండో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోవాలంటూ భర్త వేధించడంతో భరించలేకపోయిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఓడీ చెరువు మండలం గజ్జిబండ తండాలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. గజ్జిబండతండాకు చెందిన  మోహన్‌నాయక్‌తో సుహాసిని(23)కి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

వీరికి మూడేళ్ల కుమార్తె, మూడు నెలల వయసు గల కవల (మగ) పిల్లలు ఉన్నారు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత నుంచి మోహన్‌నాయక్‌కు మరదలి (భార్య చెల్లి)పై కన్నుపడింది. ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడు. భార్య ఒప్పుకోకపోవడంతో తరచూ గొడవపడుతూ వేధించేవాడు. గురువారం రాత్రి ఇద్దరూ మరోసారి ఘర్షణపడ్డారు. భర్త వేధింపులతో మనస్తాపానికి గురైన సుహాసిని పక్కగదిలోకి వెళ్లి పురుగుమందు తాగింది. శుక్రవారం ఉదయం గదిలో నుంచి బయటకు రాకపోవడంతో భర్త తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే మృతి చెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement