తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలంలోని బొందెలదిన్నె గ్రామానికి చెందిన రాజీ (21) ఉరేసుకొని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని మదన అనంతపురం గ్రామానికి చెందిన రాజీకి బొందెలదిన్నె గ్రామానికి చెందిన మల్లికార్జునకు రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. మల్లికార్జున గెర్దావ్ స్టిల్‌ప్లాంటులో విధులు నిర్వహించేవాడు. విధులకు సక్రమంగా వెళ్లకపోవడంతో తొలగించారు. దీంతో మల్లికార్జున ఖాళీగానే ఉంటున్నాడు.
మనస్థాపం చెందిన రాజీ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకుందా? లేక ఏమైన కారణాలు ఉన్నాయా? అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం అత్తింటివారి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. మృతురాలికి సంతానం లేదు. ఎస్‌ఐ నారాయణరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
Published Sun, Mar 12 2017 10:27 PM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM
Advertisement
Advertisement