భోగినేపల్లి (రాప్తాడు) : మండలంలోని భోగినేపల్లి గ్రామంలో ఓ వివాహిత బుధవారం రాత్రి కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..రొద్దం మండలానికి చెందిన బంగారు శివమ్మ (27)కు ఆరేళ్ల కిత్రం భోగినేపల్లికి చెందిన పరంధాముడుతో వివాహమైంది. నాలుగేళ్లుగా శివమ్మకు కడుపునొప్పితో బాధపడుతోంది. అనంతపురం, కర్నూలు, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో చికిత్స చేయించుకున్నా ఆమెకు కడుపునొప్పి తగ్గలేదు.
బుధవారం సాయంత్రం కూడా కడుపునొప్పి వచ్చింది. గ్రామంలో ఆర్‌ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స చేయించుకుంది. రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ కడుపునొప్పి రావడంతో పశువుల కొట్టంలో దూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను అనంతపురం ప్రభుత్వసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధరణిబాబు తెలిపారు.
కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
Published Thu, Jun 22 2017 7:51 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM
Advertisement
Advertisement