ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య | man suicide in hotel room | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Published Sat, Feb 21 2015 3:02 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య - Sakshi

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌ : నగరంలోని భాగ్యలక్ష్మీ లాడ్జిలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు... తిరుపతికి చెందిన మురళి అలియాస్ అజ్మద్(32) ఆసిఫ్‌నగర్ గిర్రా ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఓ ముస్లిం యువతిని పెళ్లి చేసుకోవడానికి అతను ఇస్లాం మతంలోకి మారాడు. ఈ క్రమంలోనే ఏడు నెలల క్రితం ఆ యువతిని పెళ్ళి చేసుకున్నాడు.

పెళ్లి అనంతరం వీరి మధ్య వివాదాలు రావడంతో మూడు రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి లక్డీకాపూల్‌లోని భాగ్యలక్ష్మీ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. ఉదయం నిద్రలేపమని మేనేజర్‌కి చెప్పాడు. శనివారం ఉదయం నిద్రలేపడానికి వెళ్లిన హోటల్ సిబ్బందికి రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆతహత్య చేసుకున్న మురళి కనిపించాడు.

హోటల్ సిబ్బంది విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.  పోస్టుమార్టం నిమిత్తం  మృత దేహాన్ని గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు గతంలో గంగజమున హోటల్‌లో పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. వైవాహిక జీవితంలో వచ్చిన మనస్పర్ధలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
(లక్డీకాపూల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement