కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య | woman suicide in warangal district over family problems | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

Published Sun, Feb 14 2016 10:05 PM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

woman suicide in warangal district over family problems

నర్సంపేట: వరంగల్ జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. నర్సంపేటలోని ఫాఖాల్ రోడ్‌లో సుజాత అనే మహిళ నివాసం
ఉంటోంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్న క్రమంలో సుజాత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement