హౌస్‌లో అందాల పోటీ.. నాకేం తక్కువా అంటూ అమర్‌ దీప్‌ ఫైర్!! | Bigg Boss Season Telugu 7 Latest Promo Released | Sakshi
Sakshi News home page

Bigg Boss Season Telugu 7: 'ఇవన్నీ చెప్పలేదు సార్'.. శివాజీపై అమర్‌దీప్‌ ఆగ్రహం!!

Sep 29 2023 1:53 PM | Updated on Sep 30 2023 2:00 PM

Bigg Boss Season Telugu 7 Latest Promo Released  - Sakshi

బిగ్ బాస్ సీజన్-7 తెలుగు ఈ ఏడాది ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే మూడు వారాల్లో వరుసగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాలుగో వారానికి సంబంధించి ఇప్పటికే ఆరుగురు నామినేషన్స్‌కు ఎంపికయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, ప్రియాంక జైన్, రతిక రోజ్, ప్రిన్స్ యావర్ ఉన్నారు. అయితే హౌస్‌లో కొత్త కొత్త టాస్క్‌లు ఇస్తూ బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లకు పరీక్ష పెడుతున్నారు. తాజాగా ఇవాళ రిలీజైన బిగ్‌ బాస్‌ ప్రోమోలో సరికొత్త టాస్క్‌ను పరిచయం చేశారు.

ఈ ప్రోమో చూస్తే హౌస్‌మేట్స్ మధ్య అందాల పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌ విచిత్రమైన గెటప్స్‌లో కనిపించి సందడి చేశారు. ‍అయితే ఈ పోటీల్లో ఎవరో ఒకరిని విజేతగా ప్రకటించాల్సిన బాధ్యత జడ్జిలుగా వ్యవహరిస్తున్న శివాజీ, ఆట సందీప్, శోభాశెట్టిపైనే ఉంది. అయితే అందాల పోటీల్లో కంటెస్టెంట్స్‌ అందరూ ప్రదర్శన ఇచ్చారు. 

ఆ తర్వాత ఈ పోటీలో విజేతగా శుభ శ్రీ అంటూ జడ్జిలు ప్రకటిస్తుండగా.. అమర్‌ దీప్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మీ జడ్జ్‌మెంట్‌పై నాకు అనుమానం ఉంది. నేను మాట్లాడాక చెప్పండి అన్నాడు. ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ నేను మీకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించాడు. దీంతో హౌస్‌ ఒక్కసారిగా హాట్‌  హాట్‌గా మారిపోయింది. మీకు ఇష్టమైనవారినే విజేతలుగా నిర్ణయిస్తారా అంటూ ఫైరయ్యాడు. అయితే దీనికి శివాజీ సైతం రిప్లై ఇచ్చాడు. సుబ్బు ఇన్నోవేటివ్‌గా అనిపించింది చెప్పిన డ్రెస్సెస్ ప్రకారం.. ముందు నువ్వు రూల్‌ బుక్‌ చూసి మాట్లాడు అంటూ అమర్‌దీప్‌కు కౌంటరిచ్చాడు. అయితే ఇవన్నీ వాడుకోమని చెప్పారు.. కానీ ఇవన్నీ చెప్పలేదు సార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోమో చూస్తే ఈ రోజు జరగనున్న ఎపిసోడ్‌లో అందాల పోటీ మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు కనిపస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement