తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అమర్‌దీప్ చౌదరి మెగాస్టార్ లెక్క.. సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైన అమర్ ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ టైటిల్ విన్నర్‌గా ఆట బరిలోకి దిగిన అమర్‌లో గెలవాలనే తపన, కోరిక ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే తన ఆటలో రాణిస్తున్నాడు. ఐదు వారాలుగా ఎలిమినేషన్‌లో లిస్ట్‌లో ఉన్నా... ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అవుతూ తన సత్తాను చాటుతున్నాడు. ప్రతి గేమ్‌లోనూ పట్టువదలకుండా ఆడుతూ ప్రత్యర్థులకు తనదైన స్టైల్‌లో సమాధానం ఇస్తున్నాడు.
కానీ బిగ్‌బాస్ లైవ్ చూస్తున్న వారు మాత్రం అమర్‌కు అన్యాయం జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. హౌస్‌లో ఆయన చేస్తున్న మంచి పనులను చాలా వరకు ప్రసారం కావడం లేదని చెప్పుకొస్తున్నారు. కేవలం అమర్ తప్పుల్ని మాత్రమే బయటి ప్రపంచానికి చూపుతున్నారనే విమర్శలు అమర్ ఫ్యాన్స్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: పెళ్లై నెల కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్)
తాజాగా పల్లవి ప్రశాంత్ అభిమానులు కొందరు అమర్ తల్లి రూప, అతని భార్య తేజస్వని గౌడల పట్ల అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారని ఆయన అమ్మగారు కన్నీరు పెట్టిన విషయం తెలిసందే. బిగ్‌బాస్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ షోగా మాత్రమే చూడండి. కంటెస్టెంట్ల కుటుంబాలకు చెందిన వ్యక్తులను భూతులతో తిట్టడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదని పలువురు తెలుపుతున్నారు.
అనంతపురం నుంచి లండన్‌కు
అమర్ దీప్ 1990 నవంబర్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో జన్మించాడు. ఆయన తండ్రి అమీర్ బాషా. కూచిపూడి డ్యాన్సర్, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కూడా.. అమర్ తల్లి పేరు రూపా.. ఆమె కూడా కూచిపూడి నృత్యకారిణి. గతంలో ఆమె బీజేపీలో క్రీయాశీలకంగా పనిచేశారు. అలా అనంతపురం ప్రాంతంలో ప్రముఖంగా గుర్తింపు పొందారు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదివిన అమర్.. మాస్టర్స్ చదివేందుకు లండన్ వెళ్లి 2016లో పూర్తి చేసి తిరిగొచ్చాడు. తర్వాత కేరళలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేసి సినిమాలపైన మక్కువతో హైదరాబాద్ వచ్చేశాడు.
(ఇదీ చదవండి: ప్రముఖ ఓటీటీలోకి వచ్చేస్తున్న బెస్ట్ హర్రర్ తెలుగు సినిమా)
అలా తన జాబ్‌ను పక్కన పెట్టి లెక్కలేనన్ని షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో నటించాడు. వాటిలో నా పబ్ జీ వైఫ్, డేట్, లవ్ యు జిందగీ,గర్ల్‌ఫ్రెండ్ పిజ్జా vs గోంగూర, మంగమ్మ గారి మనవడు, గర్ల్ ఫ్రెండ్ ఊరెళితే, సూపర్ మచ్చి, రాజు గారి కిడ్నాప్ వంటివి మంచి గుర్తింపు తెచ్చాయి. మొదటిసారి 2017లో 'ఉయ్యాల జంపాలా' అనే సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు అమర్. ఆ తర్వాత 'సిరి సిరి మువ్వలు' అశ్విన్ అనే ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రియాంక జైన్‌తో కలిసి 'జానకి కలగనలేదు' సీరియల్‌తో మరింత పాపులర్ అయ్యాడు. కృష్ణార్జున్ యుద్ధం, శైలజా రెడ్డి అల్లుడు వంటి సినిమాల్లో కూడా ఆమర్ మెరిశాడు.
కన్నడ బ్యూటీతో ప్రేమ పెళ్లి
ఇక సీరియల్ నటి, కన్నడ బ్యూటీ అయిన తేజస్వని గౌడను ఆమర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని అమర్ తల్లి రూపతో చెప్పి ఆపై అందరీ అంగీకారంతో కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఆమర్‌కు హీరో రవితేజ అంటే చెప్పలేనంత అభిమానం. రవితేజ స్టైల్‌నే అమర్ కూడా అనుసరిస్తూ ఉంటాడు.
Comments
Please login to add a commentAdd a comment