శివాజీని చేతులెత్తి వేడుకున్న అమర్‌దీప్‌.. ఎందుకంటే? | Bigg Boss Latest Episode Promo Goes Viral On Captain Contender Post | Sakshi
Sakshi News home page

Bigg Boss: మళ్లీ అదే సీన్‌.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన అమర్‌.. చివరికీ!

Published Fri, Nov 24 2023 4:42 PM | Last Updated on Fri, Nov 24 2023 4:50 PM

Bigg Boss Latest Episode Promo Goes Viral On Captain Contender Post - Sakshi

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌ బాస్‌. ప్రస్తుతం సీజన్‌-7 12వ వారానికి చేరుకుంది. గతవారం ఎవరినీ ఎలిమినేట్ చేయని బిగ్‌బాస్‌.. ఈ వారంలో ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని హింట్ ఇచ్చాడు. మరీ ఈ వారంలో ఎవరు బయటకు రానున్నారో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. అయితే ఈలోగా సేఫ్‌ అయ్యేందుకు ఉన్న అవకాశాల కోసం కంటెస్టెంట్స్‌ పోటీ పడుతున్నారు. తాజా ఎపిసోడ్‌లో కెప్టెన్ కంటెండర్‌ పోటీని బిగ్‌ బాస్‌ నిర్వహించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. 

(ఇది చదవండి: స్టార్ హీరో వారసుడు తెరంగేట్రం.. డైరెక్టర్‌గా ఎవరంటే?)

ప్రోమో చూస్తే అయితే ఈ పోటీలో చివరికీ అమర్, అర్జున్ మాత్రమే ఫైనల్‌గా కెప్టెన్‌ పోటీలో నిలిచినట్లు తెలుస్తోంది. గతవారంలో తృటిలో కెప్టెన్సీ కోల్పోయిన అమర్‌దీప్‌ బోరున ఏడ్చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే తరహాలో హౌస్‌లో హంగామా చేశాడు. అమర్‌, అర్జున్‌ విషయంలో శివాజీ, శోభాశెట్టి తన అభిప్రాయాలు బిగ్‌బాస్‌కు వెల్లడించారు. కెప్టెన్సీ పోటీలో అర్జున్‌కు వ్యతిరేకంగా శోభాశెట్టి తన నిర్ణయాన్ని వెల్లడించింది.

కెప్టెన్‌ అయ్యేందుకు నీకెంత అర్హత ఉందో.. అమర్‌కు అంతే ఉందని చెప్పింది. ఆ తర్వాత శివాజీ కెప్టెన్సీ పోటీలో అర్జున్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో అమర్‌దీప్‌, శివాజీని బతిమాలాడారు. ప్లీజ్ అన్న.. అర్థం చేసుకో.. ఇప్పుడు అవకాశం వచ్చింది.. పోగోట్టకన్నా.. నీకు దండం పెడతా అంటూ రెండు చేతులతో మొక్కాడు. నువ్వు కెప్టెన్‌ అవ్వడం కోసం ఏడుస్తున్నావేంట్రా? అని శివాజీ అన్నాడు. నేను కెప్టెన్ అవ్వాలన్నా అంటూ శివాజీని వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు అమర్. కానీ చివరికీ నేను దేనికి పనికిరాను అంటూ అమర్ ఎమోషనలయ్యాడు. ఆ తర్వాత అమర్‌ ఫోటో మంటల్లో కాలిపోతూ ఉండగా ప్రోమో ముగిసింది. మరీ ఈ వారం కెప్టెన్సీ ఎవరినీ వరించిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. 

(ఇది చదవండి: ముసలి వెంట్రుక ఎంతపని చేసింది? వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement